Parineeti Chopra: గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. తల్లి కాబోతున్న పరిణీతి చోప్రా..
బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ పంచుకున్నారు. త్వరలోనే తమ ఇంట్లోకి పండంటి బిడ్డ రాబోతుందని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తన భర్త రాఘవ్ చద్దాతో కలిసి చేతులు పట్టుకుని నడుస్తున్న వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ దంపతులకు సెలబ్రెటీలు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలీవుడ్ హీరోయిన్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ ఇంట్లోకి త్వరలోనే పండంటి బిడ్డ రాబోతుందని తెలియజేస్తూ.. “మా చిన్ని ప్రపంచం.. త్వరలో మా జీవితాల్లోకి రాబోతుంది” అంటూ తన భర్త రాఘవ్ చద్దాతో కలిసి చేతులు పట్టుకుని నడుస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది పరిణితి. దీంత ఈ దంపతులకు సెలబ్రెటీలు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కంగ్రాట్యులేషన్స్ అంటూ పరిణితి చోప్రా కజిన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా రియాక్ట్ అయ్యారు. కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ సోనమ్ కపూర్, కంగ్రాట్స్ అంటూ భూమి పెడ్నేకర్, హుమా ఖురేషి కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
పరిణీతి చోప్రా తల్లికాబోతుందంటూ గత కొన్ని రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే అప్పుడు పరిణితి ఆ రూమర్స్ ను ఖండించింది. ఇక ఇప్పుడు అంతకుముందు, ఆమె తన భర్త రాఘవ్ తో స్వాతంత్ర్య దినోత్సవం నాడు నాణ్యమైన సమయాన్ని గడపడం, ఆరోగ్యకరమైన భోజనం ఆనందించడం గురించి ఒక పోస్ట్ పోస్ట్ చేసింది. “ఇంట్లో ఒక మధ్యాహ్నం, మన దేశం రంగులు, కుటుంబ ప్రేమతో తడిసిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! @raghavchadha88,” అని ఆమె రాసింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..
పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా 2023 సెప్టెంబర్ లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రియాంక చోప్రాకు పరిణీతి చోప్రా కజిన్. ఇటీవలే అమర్ సింగ్ చంకీల మూవీతో హిట్టు అందుకుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..








