AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రాత్రిపూట నిర్దాక్షిణ్యంగా యువతిని ట్రైన్‌లోంచి దించేసిన టీసీ.. అసలేం జరిగిందంటే?

అసలే అర్థరాత్రి.. పైగా బయట జోరు వర్షం.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆడపిల్ల ఉంటే ఎవరైనా ఏం చేస్తారు. ఆమెకు సురక్షితంగా తాను వెళ్లాల్సిన ప్రాంతానికి చేర్చడమే లేదా తమకు తోచిన సహాయమో చేస్తారు. కానీ ఇక్కడో అధికారి మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించారు. టికెట్ లేదనే కారణంతో అర్థరాత్రి జోరుగా కురుస్తున్న వర్షంలో ఓ యువతిని ట్రైన్‌ నుంచి దించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: రాత్రిపూట నిర్దాక్షిణ్యంగా యువతిని ట్రైన్‌లోంచి దించేసిన టీసీ.. అసలేం జరిగిందంటే?
Viral Train Video
Anand T
|

Updated on: Jun 16, 2026 | 8:14 AM

Share

టికెట్ లేకుండా ప్రయాణిస్తుందన్న కారణంలో ఓ రైల్వే టీసీ యువతి రాత్రిపూట భారీ వర్షంలో ట్రైన్‌ నుంచి దించేసిన వీడియో ఒకటి ఇప్పుడ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన జనాలు ఆ టీసీ నిర్ణయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాత్రి పూట వర్షం కురుస్తున్న సమయంలో ఓ యువతి ట్రైన్ డోర్ దగ్గర నిల్చొని ఉండగా.. ట్రైన్‌లో ఒక టీసీ నిలబడి ఉన్న 13 సెకన్ల వీడియో ఇకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

వీడియో ప్రకారం.. ఓ యువతి ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా.. ఓ టీటీఈ టికెట్లు తనిఖీ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఓ యువతి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు అతను గుర్తించారు. దీంతో ట్రైన్ మరో స్టేషన్‌కు చేరుకోగానే.. యువతిని ట్రైన్ దిగి వెళ్లాలని ఆదేశించారు. దీంతో మొదట యువతి ట్రైన్ దిగినప్పటికీ.. బయట భారీ వర్షం కురుస్తుండడంతో.. ఆమె మళ్లీ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ ఆ టీసీ మాత్రం ఆమెను మళ్లీ ట్రైన్‌ ఎక్కనివ్వక పోవడంలో ఆమె తన వస్తువులను తీసుకొని ట్రైన్ దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాలు మాత్రం కార్లిటీగా తెలిదు.

ఇవి కూడా చదవండి

అయితే అక్కడున్న కొందరు వ్యక్తులు సంఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అది అతని డ్యూటీ.. అతను చేసిన దాంట్లో తప్పేం లేదని కామెంట్స్ చేయగా.. బయట వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆమె పట్ల కాస్త జాలి చూపాల్సిందని మరి కొందరు కామెంట్స్ చేశారు.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Vinay Sharma (@vinayshaarma)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us