AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Washing: అన్నం వండే ముందు బియ్యాన్ని కడగాలా? వద్దా..?.. కొత్త స్టడీలో తేలిందేంటి?

బియ్యాన్ని వండటానికి ముందు కడగడం అనేది మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న అలవాటు. బియ్యంలో ఉన్న దుమ్మ, దూళి పోయేందుకు మనం ఒకటికి రెండు సార్లు బియ్యాన్ని కడిగి అన్నం పెడతాం. కానీ తాజాగా వెలువడిన కొన్ని అధ్యనాలు దీనికి గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టాయి. కాబట్టి ఈ అధ్యయనాలు ఏం చెబుతున్నాయో, బియ్యాన్ని కడగడం వల్ల మంచిదా? కాదా? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Rice Washing: అన్నం వండే ముందు బియ్యాన్ని కడగాలా? వద్దా..?.. కొత్త స్టడీలో తేలిందేంటి?
Should You Wash Rice Before Cooking
Anand T
|

Updated on: Jun 15, 2026 | 8:53 PM

Share

బియ్యాన్ని వండటానికి ముందు కడగడం అనేది మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న అలవాటు. సాధారణంగా బియ్యంపై ఉండే ధూళి, రసాయనాలు లేదా మైక్రోప్లాస్టిక్‌లను తొలగించడానికి మనం బియ్యాన్ని కడుగుతాము. బియ్యం కడిగినప్పుడు వచ్చే తెల్లటి లేదా పాల రంగు నీరు అందులోని స్టార్చ్ వల్ల వస్తుంది. అయితే, ఇలా కడగడం వల్ల కేవలం మురికి మాత్రమే కాదు, బియ్యంలో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా కొట్టుకుపోతాయని తాజాగా వెలువడిన కొన్ని అధ్యనాలు చెబుతున్నాయి.

పోషకాలు తగ్గే అవకాశం ఉందా?

లైవ్ సైన్స్ కథనం ప్రకారం, బియ్యాన్ని ఎక్కువగా కడగడం వల్ల వాటిలో ఉండే నీటిలో కరిగే గుణం ఉన్న ఐరన్ , జింక్, రాగి, వెనాడియం వంటి ముఖ్యమైన సహజ పోషకాలు తగ్గిపోతాయని తేలింది. అయితే, ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం రోజువారీ తీసుకునే మొత్తం పోషకాలలో బియ్యం ద్వారా లభించే వాటా కొంతే కాబట్టి, దీన్ని కడగడం వల్ల పోషకాహార లోపం వచ్చేంత పెద్ద నష్టమేమీ జరగదని తెలుస్తోంది.

గతంలో అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, బియ్యాన్ని పండించేటప్పుడు, పాలిష్ చేసేటప్పుడు వాటిపై చేరే తవుడు, ధూళిని తొలగించడానికి కడగడం అవసరమే. కానీ, 3 నుండి 5 సార్లు ఎక్కువగా కడగడం వల్ల బియ్యం పైపొరల్లో ఉండే దాదాపు 60 నుండి 80 శాతం ఫ్యాట్స్, పోషకాలు నీటిలో కలిసి పోతాయి. ఆ నీటికి మనం పారబోయడం ద్వారా ఈ పోషకాలను మనం కోల్పోతామని చెబుతున్నాయి. కాబట్టి బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడితే సరిపోతుందని గత అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఎలాంటి బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు?

ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో లభించే ప్యాక్ చేసిన బియ్యాన్ని వినియోగదారులకు అందించే ముందే అత్యాధునిక మిషన్లు, బ్లోయర్ల ద్వారా క్లీన్ చేసి, ఆరబెడతారు. దీనివల్ల నిల్వ ఉంచినప్పుడు వాటిలో ఎలాంటి పురుగులు, బ్యాక్టీరియా చేరవు. ఇలాంటి బియ్యాన్ని అసలు కడగాల్సిన అవసరం లేదు. ఒక వేల మీరు మిళ్లు నుంచి నేరుగా బియ్యాన్ని తెచ్చుకుంటే లేదా రేషన్ షాప్‌ నుంచి తెచ్చకున్న బియ్యాన్ని మాత్రం ఒకటి లేదా రెండు సార్లు కడిగితే సరిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..
జిమ్‌కు వెళ్లలేకపోతున్నారా? ఐతే ఇంట్లోనే ఈ పని చేయండి..
జిమ్‌కు వెళ్లలేకపోతున్నారా? ఐతే ఇంట్లోనే ఈ పని చేయండి..