AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : కెప్టెన్‌ను కాపాడాడు.. తాను మాత్రం బుక్కయ్యాడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైభవ్ వీడియో

Video : ఇండియా ఏ, శ్రీలంక ఏ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వైరల్ వీడియో చర్చనీయాంశమైంది. అంపైర్‌తో వాగ్వాదం చేస్తున్న తిలక్ వర్మను శాంతింపజేసిన వైభవ్, అనంతరం లంక ఆటగాడిని నెట్టేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ట్రై సిరీస్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.

Video : కెప్టెన్‌ను కాపాడాడు.. తాను మాత్రం బుక్కయ్యాడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైభవ్ వీడియో
Vaibhav Sooryavanshi (3)
Rakesh
|

Updated on: Jun 16, 2026 | 8:04 AM

Share

Video : భారత యువ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య దాంబూలా వేదికగా జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడమే కాకుండా మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన పలు ఆసక్తికర వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 15 ఏళ్ల భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, తన కెప్టెన్ తిలక్ వర్మను వెనక్కి నెట్టి అంపైర్‌తో జరుగుతున్న పెద్ద గొడవను ఆపడం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

లెగ్ బై వివాదంతో మొదలైన అసలు రచ్చ

ఈ మ్యాచ్ ముగింపు దశకు వచ్చేసరికి అంపైర్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయం టీమిండియా క్యాంప్‌లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. మ్యాచ్ ఆఖరి బంతికి శ్రీలంక గెలవడానికి రన్ కావాల్సి ఉండగా.. అంపైర్ లంక జట్టుకు లెగ్-బై రూపంలో ఒక పరుగును కేటాయించారు. అయితే లంక బ్యాటర్ అసలు షాట్ ఆడటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని, కాబట్టి ఆ రన్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని భారత ఆటగాళ్లు గట్టిగా వాదించారు. కానీ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో స్కోర్లు సమమై మ్యాచ్ టైగా ముగిసింది.

బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మ వర్సెస్ అంపైర్

మ్యాచ్ టై అయిన తర్వాత మైదానంలో వెలుతురు చాలా తగ్గిపోయింది. ఇంత తక్కువ వెలుతురులో సూపర్ ఓవర్ ఆడాలా వద్దా అనే విషయంపై మ్యాచ్ నిర్వాహకులు కాలయాపన చేశారు. దీనికి తోడు అంతకుముందు ఇచ్చిన తప్పుడు లెగ్ బై రన్ పట్ల భారత కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. బౌండరీ లైన్ వద్దకు వచ్చిన అంపైర్లతో తిలక్ వర్మ అత్యంత దూకుడుగా వాగ్వాదానికి దిగాడు. అంపైర్ల నిర్ణయాలను, అక్కడి ఆట పరిస్థితులను ప్రశ్నిస్తూ తిలక్ వర్మ గట్టిగా అరుస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

తిలక్ వర్మను శాంత పరిచిన వైభవ్

తిలక్ వర్మ, అంపైర్ల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతున్న సమయంలో.. ఎవరూ ఊహించని విధంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మధ్యలోకి వచ్చాడు. గొడవ పెద్దదైతే కెప్టెన్‌పై ఐసీసీ నిషేధం వేసే ప్రమాదం ఉందని గ్రహించిన వైభవ్.. ఏకంగా తన కెప్టెన్ తిలక్ వర్మను రెండు చేతులతో పక్కకు నెట్టేసి, అంపైర్ల నుంచి అతడిని దూరంగా తీసుకెళ్లాడు. చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరించి మ్యాచ్ సజావుగా సాగేందుకు, సూపర్ ఓవర్ ప్రారంభం అయ్యేందుకు వైభవ్ సహకరించాడు. ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

మరుక్షణమే రివర్స్ అయిన సీన్.. లంక ప్లేయర్లపైకి వైభవ్

బౌండరీ లైన్ వద్ద కెప్టెన్‌ను శాంతింపజేసి పీస్ మేకర్‎గా ప్రశంసలు అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన అసలు రూపాన్ని చూపించాడు. సూపర్ ఓవర్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత, నిరాశగా వెనుతిరుగుతున్న వైభవ్‌ను శ్రీలంక-ఎ ఆటగాళ్లు కావాలనే రెచ్చగొట్టేలా కామెంట్లు చేశారు. దీంతో అంతసేపు సహనంగా ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి.. లంక ఆటగాళ్ల వైపు దూసుకెళ్లి ఒక ఫీల్డర్‌ను గట్టిగా నెట్టేశాడు. ఒకే మ్యాచ్‌లో కొద్ది నిమిషాల వ్యవధిలోనే వైభవ్ రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us