ఫేస్ ప్యాక్‌లు కాదు.. అసలైన అందం అలా చేస్తేనే.. రష్మిక కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
15 June 2026
సహజంగా సినీ తారల మెరిసే చర్మం , అందం వెనుక రకరకాల కాస్మెటిక్స్, ఖరీదైన ఫేస్ ప్యాక్‌లు, బ్యూటీ ట్రీట్‌మెంట్లు ఉంటాయని అందరూ భావిస్తుంటారు. సెలబ్రిటీల అందం రహస్యం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ టాపిక్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం తన గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న అసలైన రహస్యం వేరే ఉందని స్పష్టం చేశారు. బాహ్య సౌందర్యం కంటే ఆనందమే అసలైన అందమన్నారు.
ఇటీవల రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇస్తూ సందడి చేశారు రష్మిక.
ఒక అభిమాని ఆమెను "మీ అందం వెనుక ఉన్న రహస్యం ఏంటి? మీ చర్మం అంతగా ఎలా మెరుస్తుంది?" అని ప్రశ్నించారు. దానికి రష్మిక ఎంతో సానుకూలంగా స్పందిస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
"నిజమైన అందం అనేది మనం వాడే ఫేస్ ప్యాక్‌లు లేదా బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల రాదు. ఎప్పుడూ మనసులో సంతోషంగా ఉండటమే నా బ్యూటీ సీక్రెట్. మిమ్మల్ని ఎల్లప్పుడూ నవ్వించే వ్యక్తులు మీ చుట్టూ ఉండాలి.
మీ చుట్టూ పాజిటివిటీని నింపే వ్యక్తులతో సమయాన్ని గడపండి. మనలోని అమాయకత్వాన్ని అలాగే కాపాడుకుంటేనే జీవితంలో నిజమైన ఆనందం దొరుకుతుంది" అని చెప్పుకొచ్చారు
మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఆ మెరుపు దానంతట అదే ముఖంలో కనిపిస్తుందని ఆమె వివరించారు. నెగెటివిటీకి దూరంగా ఉంటే సంతోషంగా ఉంటారని తెలిపింది.
ప్రస్తుతం రష్మిక చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజమైన అందం మన ఆలోచనల్లోనే ఉందంటూ ఆమె చెప్పిన విధానాన్ని నెటిజన్లు ఎంతగానో అభినందిస్తున్నారు.