AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..

మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కురవి మండలం నేరడ శివారు ఎలుకచెట్టుతండాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల గగన్ విహారిని త్రాచుపాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మృతితో ఆవేదనకు గురైన తండ్రి పామును వెంటాడి చంపాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..
Mahabubabad Snakebite
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 8:54 AM

Share

ఇంటి ముందు ఆడుకుంటుండగా పాముకాటుకు గురైన ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ బాలుడు తండ్రి పామును కసితీరా చంపి పగ తీర్చుకున్నాడు ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారు ఎలుకచెట్టుతండా గ్రామ పంచాయతీ మంచ్యాతండాలో జరిగింది.. బానోతు మధు, అరుణ దంపతుల కుమారుడు గగన్ విహారి(7) త్రాచుపాము కాటుకు గురయ్యాడు. బాలుడు సాయంత్రం వేళ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో రాతిగోడ మధ్య నుండి బయటకు వచ్చిన త్రాచు పాము కాటేసింది.. వెంటనే గమనించిన తండ్రి కుటుంబ సభ్యులు ఆ పామును వెంటాడి హత మార్చారు..

ఈ క్రమంలోనే.. బాలుడ్ని అక్కడి నుండి హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. కానీ ఫలితం దక్కలేదు.. అప్పటికే.. ఆ బాలుడికి ఏడేళ్లకే నూరేళ్లు నిండాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాదుడు మృతి చెందాడు.. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

బుడి బుడి అడుగులతో.. నిత్యం సందడి చేస్తూ.. స్కూల్ కు వెళ్లే గగన్ విహారి మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

వర్షాకాలంలో పాములు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇళ్ల పరిసరాల్లో పొదలు, రాళ్ల కుప్పలు, చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. పాము కాటు వేస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించాలి. సంప్రదాయ వైద్యాలు, మూఢనమ్మకాలను నమ్మకూడదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us