AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశాంతత అనుకుంటున్నారేమో.. కానీ ప్రాణాలకే ప్రమాదం.. ఈ అలవాటుతో తస్మాత్‌ జాగ్రత్త!

ఈ రోజుల్లో మనుషులు డిజిటల్‌గా అందరికీ కనెక్ట్ అవుతున్నారు కానీ, మనసుల పరంగా ఒంటరి అయిపోతున్నారు. అయితే, ఈ ఒంటరితనం అనేది కేవలం ఒక మానసిక బాధ మాత్రమే కాదు.. అది మీ ప్రాణాలకే ముప్పు తెచ్చే ఒక నిశ్శబ్ద శత్రువు అని మీకు తెలుసా? ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సదస్సులో నిపుణులు వెల్లడించిన నిజాలు వింటే షాక్ అవ్వాల్సిందే.

ప్రశాంతత అనుకుంటున్నారేమో.. కానీ ప్రాణాలకే ప్రమాదం.. ఈ అలవాటుతో తస్మాత్‌ జాగ్రత్త!
Loneliness Health Risks
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 8:54 AM

Share

ప్రస్తుత బిజీలైఫ్‌.. ఆర్థిక పోరాటం కారణంగా చాలా మంది తమకు కావాల్సిన వారితో గడిపే సమయం కూడా దొరకట్లేదు. దీంతో చాలా మంది ఒంటరిగానే జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ఈ ఒంటరితనమే వారికి షాపంగా మారుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. నిపుణుల ప్రకారం.. ఒంటరితనం వల్ల కలిగే శారీరక నష్టం. రోజుకు 15 సిగరెట్లు తాగడం వల్ల కలిగే నష్టంతో సమానమట. స్థూలకాయం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చే జబ్బుల కంటే ఒంటరితనం వల్ల వచ్చే ముప్పు చాలా ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి సమాజానికి, బంధువులకు దూరంగా ఒంటరిగా గడపడం వల్ల శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తాయి.

ఒంటరి తనం అనేది మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది?

గుండె జబ్బుల ముప్పు: ఒంటరితనం వల్ల వచ్చే ప్రధాన సమస్యల్లో హార్ట్‌ ఎటాక్ మొదటి స్థానంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. మన ఒంటరిగా ఉంటూ ఎప్పుడూ ఆందోళనలో ఉండడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 29 శాతం, పక్షవాతం వచ్చే ముప్పు 32 శాతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మానసిక కుంగుబాటు: ఒప్పుడూ ఒక్కరమే ఉంటూ, లోన్‌లీగా పీల్ అవ్వడం వల్ల తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి : ఒంటరితనం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని. దీనివల్ల త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారమని వైద్యులు చెబుతున్నారు.

జ్ఞాపకశక్తి తగ్గడం: ఈ ఒంటరి తనం అనే సమస్య వృద్ధులలో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం రెట్టింపు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు

ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలి?

సామాజిక అనుబంధం అనేది మనిషికి ఆహారం, నీరు ఎంత అవసరమో అంత అవసరం. మనుషులతో కలవకపోవడం వల్ల శరీరం నిరంతరం ఒత్తిడికి గురవుతుంది. ఇది కాలక్రమేణా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో వందల మంది ఫ్రెండ్స్ ఉన్నా మనం ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలంటే.. మనకు కచ్చితంగా నిజమైన బంధాలు కవాల్సి.

ఫోన్‌ పక్కన పెట్టండి: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను చూస్తూ గడిపే సమయాన్ని తగ్గించి, కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

పాత స్నేహితులను కలవండి: ఎప్పుడూ వర్క్‌ బిజీలో ఉండకుండా వారానికి ఒక్కసారైనా పాత స్నేహితులతోనో, బంధువులతోనో మాట్లాడటానికి లేదా కలవడానికి ప్రయత్నించండి.

కమ్యూనిటీ యాక్టివిటీస్: పార్కులకు వెళ్లడం, నలుగురితో కలిసి యోగా లేదా వాకింగ్ చేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఒంటరితనం నుంచి బయటపడొచ్చు.

ఆరోగ్యం అంటే కేవలం మంచి ఆహారం తినడం, జిమ్‌కి వెళ్లడం మాత్రమే కాదు.. నలుగురితో నవ్వుతూ, సంతోషంగా గడపడం కూడా..కాబట్టి, ఒంటరితనాన్ని దూరం చేసుకోండి.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us