రోజు ఒక తులసి ఆకు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. తెలిస్తే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు.
15 Jun 2026
Anand T
హిందూధర్మంలో తులసి చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యత మాత్రమే కాకుండా అపారమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని 'మూలికల రాణి' అని కూడా పిలుస్తారు.
మూలికల రాణి
తులసి ఆకులలో విటమిన్ ఎ, సి, కె లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పోషకాల గని
తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరిచి.. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
రోగనిరోధక శక్తి
తులసి ఆకుల్లో అడాప్టోజెనిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే ఆందోళన నిరాశను తగ్గిస్తాయి.
మానసిక ఒత్తిడి
తులసి ఆకులలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గ్యాస్, అజీర్ణం, కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి.
మంచి జీర్ణవ్యవస్థ
తులసి ఆకులు బీపీని కంట్రోల్ చేయడమే కాకుండా, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం
ఈ ఆకులు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. క్రమం వీటిని తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది.
షుగర్ కంట్రోల్
ఉదయం పూట ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. వీటిని నేరుగా తినడమే కాకుండా, తులసి టీ లేదా తులసి రసం రూపంలో కూడా సేవించవచ్చు.