వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌కు మించిన మొక్క ఇది.. ఇలా పెంచితే డబ్బే డబ్బు!

15 June 2026

Jyothi Gadda

స్నేక్ ప్లాంట్ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందినది. ఈ మొక్కలు ఉన్నచోట పాములు దరిచేరవు. దీని ఆకులు కత్తి ఆకారంలో, పాములా మెలికలు తిరిగి ఉంటాయి. కాబట్టి దీనిని స్నేక్ ప్లాంట్ అని పిలుస్తారు.

ఈ మొక్క సంపదను, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్ముతారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజిన్, జిలీన్ వంటి విష పదార్థాలతో పాటు ఇతర కాలుష్య కారకాలను తొలగిస్తుంది. 

రాత్రివేళ కూడా ఆక్సిజన్‌ను విడుదల చేయడం దీని ప్రత్యేకత. డస్ట్ అలర్జీ ఉన్నవారు ఈ మొక్కను నిరభ్యంతరంగా ఇంట్లో పెట్టుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం అదృష్టం కోసం స్నేక్ ప్లాంట్‌ను ఇంటి లోపల, బయట కూడా పెంచవచ్చు. 

సరైన ప్రదేశంలో ఉంచినట్లయితేనే అధిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా వంటగది, బాత్‌రూమ్, పడకగది వంటి ప్రదేశాలలో ఈ మొక్కను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. సానుకూల శక్తి కోసం వంటగదిలో  ఉంచడం చాలా మంచిది.

ఈ మొక్క పెరగడానికి సూర్యకాంతి పెద్దగా అవసరం ఉండదు. దీనివల్ల వంటగదిలో సులభంగా పెంచవచ్చు. ఇది గొప్ప క్రిమిసంహారకారిగా కూడా పనిచేస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది.

అలాగే.. ఇంటి శ్రేయస్సును కూడా వృద్ధి చేస్తుంది. వంటగదిలో తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఈ మొక్కను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టవ్ పక్కన వేడికి లేదా పొగ తగిలేలా ఉంచకూడదు. 

వంటగదిలో మొక్కలు పెంచినప్పుడు ఆకులు తేలికగా మురికి పేరుకుపోయే అవకాశం ఉంది. అందువల్ల మొక్క ఆకులపై ధూళి చేరనివ్వకుండా, శుభ్రంగా చూసుకోగలిగితేనే వంటగదిలో ఈ మొక్కను ఉంచాలి.

ఇంటి హాలులోని ఒక మూలలో కూడా ఈ మొక్కను పెంచవచ్చు. అతిథుల కంటికి కనిపించేలా ఉంచినట్లయితే, దిష్టి పోయి, ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు.

స్నేక్ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ నేలపైనే ఉంచాలి, టేబుల్‌పైన లేదా ఇతర ఉపరితలాలపై పెట్టకూడదు. ఈ మొక్క చుట్టూ ఇతర మొక్కలను ఉంచకూడదు, అలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుందని భావిస్తున్నారు.