AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch : ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వీడియో.. ఫుట్ బాల్ స్టేడియంలో కూర్చుని ఫోన్‌తో మందు తాగిన కిలాడీ

Watch : ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన FIFA World Cup 2026 తొలి మ్యాచ్‌లోనే ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది.. స్టేడియం లోపలికి మద్యం తీసుకురాకూడదనే కఠినమైన రూల్స్ ఉన్నప్పటికీ, ఒక మెక్సికన్ అభిమాని ఏకంగా మొబైల్ ఫోన్ ఆకారంలో ఉన్న ఒక సీక్రెట్ కంటైనర్‌లో మందు తెచ్చి కెమెరాకు దొరికిపోయాడు.

Watch : ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వీడియో.. ఫుట్ బాల్ స్టేడియంలో కూర్చుని ఫోన్‌తో మందు తాగిన కిలాడీ
Fifa World Cup 2026
Rakesh
|

Updated on: Jun 16, 2026 | 8:15 AM

Share

Watch : ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా ప్రపంచకప్ 2026 మెక్సికోలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో ఎంతో వైభవంగా ప్రారంభమైంది. మెక్సికో, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ హై-ప్రొఫైల్ ఓపెనింగ్ మ్యాచ్‌ను వీక్షించడానికి వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. అయితే ఈ మైదానంలో మ్యాచ్ కంటే ఎక్కువగా ఒక మెక్సికన్ ఫ్యాన్ చేసిన వింత విన్యాసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. స్టేడియం లోపలికి మద్యం తీసుకురావడాన్ని ఫిఫా పూర్తిగా నిషేధించినప్పటికీ, ఆ రూల్‌ను సదరు అభిమాని అత్యంత తెలివిగా బ్రేక్ చేశాడు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలో కూర్చున్న ఒక మెక్సికన్ అభిమాని అందరిలాగే తన చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు. అయితే కెమెరా కన్ను అతడిపై పడటంతో అసలు నిజం బయటపడింది. చూసేందుకు అచ్చం స్మార్ట్‌ఫోన్ లాగే ఉన్న ఆ పరికరం నిజానికి ఒక మందు సీసా. ఆ కంటైనర్ పైభాగంలో ఉన్న చిన్న మూతను తెరిచి ఆ అభిమాని ఎవరికీ అనుమానం రాకుండా అందులోని ఆల్కహాల్‌ను తాగుతూ లైవ్ కెమెరాలో స్పష్టంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అయిన ఎక్స్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ క్రేజీ ఘటన వెలుగుచూసిన తర్వాత ప్రపంచకప్ నిర్వాహకులు, అజ్టెకా స్టేడియం భద్రతా సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ క్రీడా మైదానాల లోపల ఆల్కహాల్ వినియోగంపై ఎన్నో ఏళ్లుగా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ప్రపంచం మొత్తం గమనిస్తున్న ఇంతటి ప్రతిష్టాత్మకమైన తొలి మ్యాచ్‌లోనే సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఒక అభిమాని నకిలీ ఫోన్ కంటైనర్‌ను లోపలికి ఎలా తీసుకురాగలిగాడని క్రీడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా స్టేడియంలోకి ప్రవేశించే ముందు అభిమానులను మెటల్ డిటెక్టర్లు, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి పంపుతారు. కానీ సదరు అభిమాని తెచ్చిన కంటైనర్ ప్లాస్టిక్ లేదా ఫైబర్ తో చేసి అచ్చం ఫోన్ లాగే డిజైన్ చేయడం వల్ల సెక్యూరిటీలు దానిని నిజమైన మొబైల్ అనుకుని వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ భద్రతా లోపంపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. టోర్నమెంట్ అంతటా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు, నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడానికి స్టేడియం యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us