ప్రియుడికి ఖరీదైన బైక్ కొనివ్వాలనే కోరికతో ఓ యువతి దొంగగా మారింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటనలో, తన తండ్రి స్నేహితుడి ఇంటిలో 9 సవర్ల బంగారం దొంగతనం చేసి ప్రియుడికి బైక్ కొనిచ్చింది. విషయం బయటపడటంతో ఆమెను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బైక్ తీసుకున్న ప్రియుడు పరారీలో ఉన్నాడు.