తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారిమెట్టు నుంచి కాణిపాకం వైపు ప్రయాణిస్తున్న హైదరాబాద్ భక్తుల కారు నియంత్రణ కోల్పోయి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు చింతల్ కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.