AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WorldCup2027: 2027 వరల్డ్ కప్‌లో ఆ స్టార్ బౌలర్ కచ్చితంగా ఉండాల్సిందే.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ విజ్ఞప్తి

WorldCup2027: టీమిండియా స్టార్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను 2027 వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని పూర్వ దిగ్గజ క్రికెటర్ సురేష్ రైనా సెలెక్టర్లకు పిలుపునిచ్చారు. సౌతాఫ్రికా వంటి విదేశీ వేదికలపై స్వింగ్, కంట్రోల్ ఉన్న భువీ సేవలు భారత జట్టుకు ఎంతగానో అవసరమని రైనా స్పష్టం చేశారు.

WorldCup2027: 2027 వరల్డ్ కప్‌లో ఆ స్టార్ బౌలర్ కచ్చితంగా ఉండాల్సిందే.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ విజ్ఞప్తి
Bhuvneshwar Kumar
Rakesh
|

Updated on: Sep 07, 2026 | 12:34 PM

Share

WorldCup2027: భారత జట్టుకు విశేష సేవలందించిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు 2027 వన్డే ప్రపంచకప్‌లో అవకాశం కల్పించాలని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా డిమాండ్ చేశారు. ఐపీఎల్ తో పాటు ఇటీవల ముగిసిన యూపీ టీ20 లీగ్‌లో భువీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు భువీ పేరును పరిశీలించాలని రైనా సూచించారు. అక్టోబర్-నవంబర్ 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఆయా దేశాల్లో ఉండే వేగవంతమైన, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై భువనేశ్వర్ అనుభవం, బంతిపై అతనికున్న నియంత్రణ భారత జట్టు విజయాలకు ఎంతో కీలకంగా మారుతాయని రైనా అభిప్రాయపడ్డారు.

యూపీ టీ20 లీగ్‌లో అద్భుత గణాంకాలు

యూపీ టీ20 లీగ్‌లో లక్నో ఫాల్కన్స్ జట్టు తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ 11 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టారు. కేవలం వికెట్లే కాకుండా ఆయన వేసిన పొదుపైన బౌలింగ్ అందరినీ ఆకట్టుకుంది. మొత్తం 11 మ్యాచుల్లో ఆయన ఏకంగా 119 డాట్ బాల్స్ వేశారు. అంటే దాదాపు 20 ఓవర్ల పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా కట్టిపడేసారు. అంతేకాకుండా కేవలం 6.11 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చి తనలోని పదును ఇంకా తగ్గలేదని నిరూపించారు. బౌలింగ్‌లో స్వింగ్, వైవిధ్యంతో ప్రత్యర్థులను తిప్పలు పెట్టడంలో భువీ శైలి ప్రత్యేకం.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కీలక సూచన

భారత జట్టు రాబోయే రోజుల్లో యువత, అనుభవం కలయికతో ముందుకు వెళ్లాలని రైనా ఆకాంక్షించారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీల అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉన్నట్లే, బౌలింగ్ విభాగంలో ఈ ఇద్దరు సీనియర్ పేసర్లు కూడా గిల్ ప్రణాళికల్లో భాగం కావాలని తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు స్పెషలిస్ట్ పేసర్లను ఎంపిక చేసే క్రమంలో భువీ అనుభవాన్ని విస్మరించకూడదని వివరించారు.

కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్

ఇక మీరట్ మెవ్రిక్స్ జట్టును విజేతగా నిలిపిన రింకూ సింగ్ కెప్టెన్సీ టాలెంట్ పై కూడా రైనా ప్రశంసల జల్లు కురిపించారు. ఒత్తిడి సమయంలో రింకూ ప్రదర్శించిన వ్యూహాత్మక చతురత అద్భుతమని కొనియాడారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం రింకూ సింగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దేశవాళీ టాలెంట్‌ను వెలికితీయడంలో యూపీ టీ20 లీగ్ ఎంతగానో తోడ్పడుతోందని కొనియాడారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us