AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూడ్డానికి అందంగా ఉంది కదూ.. వేడి నీటిలో వేయగానే రంగుమారే ఈ పువ్వు ప్రయోజనాలు తెలిస్తే..

చాలా మంది పువ్వులు కేవలం పూజ కోసమో లేదా తలలో పెట్టుకోవడానికి లేదా అంకరణ కోసం మాత్రమే వాడుతారని అనుకుంటారు. కానీ ఆ పువ్వులలో ఉండే కొన్ని పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. అవును ఇప్పుడు మీకు అలాంటి ఓ పువ్వు గురించి చెప్పబోతున్నాం.. చూడ్డానికి అందదంగా ఉండడమే కాకుంగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతకూ ఆ పువ్వు ఏది.. దాని వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Sep 07, 2026 | 12:19 PM

Share
శంఖుపుష్పం దీనినే అపరాజిత పువ్వు అని కూడా పిలుస్తారు. ఇది క్లిటోరియా టెర్నాటియా అనే ఒక తీగ జాతి మొక్కకు కాసే పువ్వు. ఇవి చూడ్డానికి ముదురు నీలం రంగులో ఉండి పువ్వుపై కొన్ని ప్రాంతాల్లో తెలుపు రంగుతో ఉంటుంది. చాలా మంది దీనిని అట్రాక్షన్ కోసం పెంచుకుంటారు. కానీ ఈ మొక్క పువ్వులు, ఆకులు, వేర్లను ఆయుర్వేదంలో సాంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు.

1 / 5
ఈ పువ్వును ఎక్కువగా హెర్బల్ టీలో వాడుతారు. ఈ పువ్వును వేడి నీటిలో వేయగానే నీరు నీలి రంగులోకి మారుతుంది. దానిలో కొద్దిగా నిమ్మరసం పిండితే ఈ టీ రంగు ఊదా లేదా గులాబీ రంగులోకి మారుతుంది. ఈ ప్రత్యేకత వల్లే ఈ పువ్వుతో తయారు చేసే టీ బ్లూ టీగా మంచి ఆదరణ తెచ్చుకుంది. ఈ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పువ్వుతో తయారు చేసే హెర్చల్ టీ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతారు.

2 / 5
ఈ శంఖుపుష్పాలలో ఆంథోసయనిన్ అనే సహజ పిగ్మెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతాయి. అలాగే ఇది కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే కళ్లలో నేరుగా దీని రసం లేదా పేస్ట్ వేయకూడదు. నిపుణుల సలహా మేరకు మాత్రమే చూడాలి. అంతేకాదు ఈ పువ్వులు, ఆకులలో ఉండే సహజ సమ్మేళనాలు వాపు, తేలికపాటి శరీర నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 5
అలాగే ఈ పువ్వులో ఉండే పోషకాలు మన చర్మం, జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, తేమను కాపాడటానికి, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు ఈ పువ్వులతో తయారు చేసిన హెర్బల్ టీని తాగడం వల్ల వాటిని దూరం చేసుకోవచ్చు.

4 / 5
అయితే ఈ పువ్వులను మీరు వాడే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పురుగుమందులు లేదా రసాయనాలు పిచికారీ చేసిన మొక్కల పువ్వులను టీ కోసం వాడకూడదు. రోడ్డు పక్కన లేదా మార్కెట్లో లభించే పూల స్వచ్ఛత తెలియకుండా నేరుగా వాటితో టీ చేసుకోకండి. డయాబెటిస్, బీపీ లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలకు మందులు వాడుతున్న వారు రోజూ బ్లూ టీ తాగే ముందు కచ్చితంగా వైద్య సలహా తీసుకోండి.

5 / 5
Follow Us