ఆ దర్శకుడు అందరి ముందు నన్ను కొట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

హేమ రిపోర్టు బయటపెట్టిన తర్వాత కన్నడతో పాటు పలు భాషల్లో నటీమణులు తమపై జరుగుతున్న, లైంగిక దాడి, మానసిక హింస గురించి మాట్లాడుతున్నారు. తమ సినీ పరిశ్రమలో కూడా హేమ కమిటీ లాంటి కమిటీ వేయాలని పలువురు హీరోయిన్స్ డిమాండ్ చేశారు.

ఆ దర్శకుడు అందరి ముందు నన్ను కొట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Padmapriya
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 02, 2024 | 9:12 AM

హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మరోసారి బహిరంగ చర్చ మొదలైంది.హేమ రిపోర్టు బయటపెట్టిన తర్వాత కన్నడతో పాటు పలు భాషల్లో నటీమణులు తమపై జరుగుతున్న, లైంగిక దాడి, మానసిక హింస గురించి మాట్లాడుతున్నారు. తమ సినీ పరిశ్రమలో కూడా హేమ కమిటీ లాంటి కమిటీ వేయాలని పలువురు హీరోయిన్స్ డిమాండ్ చేశారు. కన్నడ చిత్రసీమలో కూడా ఈ డిమాండ్ ఏర్పడింది. కాగా, తమిళ చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అవమానంపై ప్రముఖ నటి పద్మప్రియ మాట్లాడింది.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

ఏడు భాషల్లో నటించిన మలయాళ నటి పద్మప్రియ 2004లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పలు భాషల్లోని ప్రముఖ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ భామ. తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మీ,‘అందరి బంధువయ’, ‘పటేల్‌’ సినిమాల్లో నటించింది. ఉత్తమ నటనకు గానూ ఎన్నో అవార్డులు కూడా అందుకుంది ఈ భామ. తాజాగా ఓ కాలేజీ ఈవెంట్‌లో పద్మప్రియ మాట్లాడుతూ.. ‘2007లో విడుదలైన తమిళ చిత్రం ‘మృగం’లో నటిస్తున్నప్పుడు షూటింగ్ చివరి రోజు దర్శకుడు స్వామి అందరి ముందు నా చెంప పై కొట్టారు.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

ఆ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ మీడియా మాత్రం ఈ ఘటనను రివర్స్‌లో ప్రసారం చేసింది. ఆ దర్శకుడిని నేను కొట్టాను అంటూ మీడియాలో వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఘటనపై తమిళ సినీ సంఘాలకు ఫిర్యాదు చేశాను. కానీ ప్రయోజనం లేకపోయింది. దాని వల్ల ఆ తర్వాత కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నాను. నేను ఆల్రెడీ కమిట్ అయినా సినిమాల నుంచి కూడా నన్ను తొలగించారు’ అని చెప్పుకొచ్చింది పద్మ ప్రియా. కానీ ‘మృగం’ సినిమాలో నటించినందుకు నాకు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు వచ్చింది. నా నటనను ప్రజలు ఆదరించారు. నాపై ఎలాంటి కుట్ర జరిగినా, నేను చేసిన పనికి నాకు గౌరవం వచ్చింది అని తెల్పింది. కాగా పద్మప్రియ కూడా సినీరంగంలో లింగ వివక్ష గురించి మాట్లాడుతూ.. నేను కొన్నాళ్లుగా లింగవివక్ష గురించి మాట్లాడుతున్నాను అని తెలిపింది.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి