సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తమ సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు సీఎం కుటుంబసభ్యులు ఇక్కడే పండుగను జరుపుకోనున్నారు. ప్రతి ఏటా నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లెలో సంక్రాంతిని ఆనవాయితీగా జరుపుకుంటాయి.