AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వే కావాలి .. భర్త ఇంటి ముందు భార్య నిరసన

నువ్వే కావాలి .. భర్త ఇంటి ముందు భార్య నిరసన

Samatha J
|

Updated on: Jan 13, 2026 | 11:14 AM

Share

కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్ని వదలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఘనుడు.. చదివింది న్యాయశాస్త్రం అయినా తన స్వంత భార్యా, పిల్లల్ని పట్టించుకోకుండా అన్యాయం చేశాడు. కుటుంబాన్ని వదిలేసి మరో మహిళతో కలిసి మరో ప్రాంతంలో సహజీవనం చేస్తున్నాడు. దీంతో తనకు న్యాయం కావాలంటూ ఆ న్యాయవాది భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది భార్య.

కట్టుకున్న భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకొని తన కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు పిల్లలతో కలిసి మౌనపోరాటానికి దిగింది వివాహిత మహిళ. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాలలో జరిగింది. చీరాల క్రిస్టియన్ పేటకు చెందిన మేడ కిరీటికి, నెల్లూరుకు చెందిన ముంగా దీపకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మేడ కిరిటి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మరొక మహిళతో న్యాయవాది కిరిటికి పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి కిరిటి తన పిల్లలను పట్టించుకోవడం లేదని భాదితురాలు దీప ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. వివాహేతర సంబంధాన్ని నిలదీసిన క్రమంలోనే ఆరు నెలల క్రితం తనను, తన పిల్లలను వదిలేసి నెల్లూరు నుంచి తన భర్త కిరీటి చీరాలకు మకాం మార్చినట్టు తెలిపింది. చీరాలలో భర్త ఇంటి వద్ద రోడ్డు పై పిల్లలతో నిరసనకు దిగింది. సమాచారం అందుకున్న చీరాల వన్ టౌన్ పోలీసులు బాధితురాలిని స్టేషన్ తరలించి ఘటనపై విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం