నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
హైడ్రోజన్ రైలును పట్టాలపై పరుగులు పెట్టించబోతోంది భారత రైల్వే. ఈ చారిత్రక ఘట్టానికి హర్యానాలోని జింద్ స్టేషన్ రెడీ అవుతోంది. ఈ హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య 90 కిలోమీటర్లు ప్రయాణించనుంది. గంటకు 110 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఉన్న డీజిల్ రైళ్ల కంటే వేగంగా గమ్యస్థానం చేరుకుంటుంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుంది.
నీటి నుంచి ఇంధనాన్ని తయారు చేసుకుంటుంది హైడ్రోజన్ రైలు. ఇందు కోసం జింద్‌లో ఒక ప్రత్యేక ప్లాంట్‌ను నిర్మించారు. 9 లీటర్ల నీటిని విద్యుత్ విశ్లేషణ చేయడం ద్వారా 900 గ్రాముల హైడ్రోజన్‌ను తయారు చేస్తారు. ఈ 900 గ్రాముల హైడ్రోజన్.. రైలును 1 కిలోమీటర్ దూరం నడిపించేందుకు సరిపోతుంది. ఈ రైలు పొగకు బదులుగా నీటి ఆవిరి, వేడిని మాత్రమే విడుదల చేస్తుంది. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఈ హైడ్రోజన్ రైలు.. డీజిల్ ఇంజిన్ల లాగా భారీ శబ్దాలు చేయకుండా.. మెట్రో రైలు లాగా చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ హైడ్రోజన్ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. అందులో 2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. ఈ హైడ్రోజన్ రైలు ఒకేసారి 2,600 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. మెట్రో రైళ్ల తరహాలో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ, ఎల్‌ఈడీ లైటింగ్ వంటివి ఉంటాయి. ఈ రైలు టికెట్ ధర సాధారణ ప్యాసింజర్ రైళ్ల మాదిరిగానే 5 నుంచి 25 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉందని రైల్వే వర్గాల ద్వారా తెలుస్తోంది.
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
కుంగుతున్న నగరాలు! మునుగుతున్న పట్టణాలు
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
