ఇక నుంచి డీలర్ వద్దే రిజిస్ట్రేషన్
మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీకు అదిరిపోయే అప్‌డేట్ న్యూస్ ఇది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదట. వాహనం కొనుగోలు చేసిన డీలర్ వద్దనే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను డీలర్ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కార్యాలయాల్లో ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతాయన్న విమర్శలు ఉన్నాయి. వీటికి పరిష్కారంగా డీలర్ వద్దనే వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వాహన్, సారథి పోర్టల్‌ల ద్వారా షోరూంలోని డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ పోర్టల్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశాలు ఉండడంతో వెంటనే ఈ నిబంధనలను అమలు చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. డీలర్ నుంచి వచ్చిన వాహన కొనుగోలుదారుల దరఖాస్తులను రిజిస్టరింగ్ అథారిటీ పరిశీలించి నిబంధనల మేరకు పత్రాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తుంది. ఆర్‌సీని స్పీడ్ పోస్ట్ ద్వారా కొనుగోలుదారులకు పంపిస్తారు.
ఇక నుంచి డీలర్ వద్దే రిజిస్ట్రేషన్
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
కుంగుతున్న నగరాలు! మునుగుతున్న పట్టణాలు
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
