తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
వారసత్వంగా వచ్చిన ఆస్తులను తెలివిగా పెట్టుబడులు పెట్టిన థాయ్‌లాండ్ రాజు రామా ఎక్స్.. ఏకంగా రూ. 4.5 లక్షల కోట్ల సంపదను సృష్టించారు. ప్రపంచంలోని ధనిక రాజుల జాబితాలో ఆయన పేరే ముందుంటుంది. ఆయనకున్న ఇళ్లల్లో రోజుకి ఒక ఇంటికి వెళ్లి బస చేసినా.. తిరిగి మొదటి ఇంటికి చేరుకునేందుకు 47 ఏళ్లు పడుతుందట. అంటే ఆయనకు అన్ని ఇళ్లు, బంగ్లాలు ఉన్నాయన్నమాట.
థాయ్‌లాండ్ రాజు దగ్గర 38 జెట్‌లు, విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 300కు పైగా రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం 52 బంగారు పూత పూసిన యాచ్‌లు ఉన్నాయంటే ఆయన సంపద ఎంతో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద కట్ వజ్రం అయిన గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా ఆ రాజు దగ్గరే ఉంది. మహా వజ్రాలాంగ్‌కోర్న్ ఆధీనంలో 16 వేల ఎకరాల భూమి ఉంది. ఒక్క బ్యాంకాక్ లోనే 17 వేలకు పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే అద్దె రూపంలోనే ఏటా వేల కోట్ల రూపాయలు ఆయన ఎకౌంట్లోకి వచ్చి చేరతాయి. కార్పొరేట్ పెట్టుబడుల ద్వారా కూడా రాజు ఆస్తులు పెరుగుతున్నాయి. సియామ్ కమర్షియల్ బ్యాంక్‌లో 23 శాతం వాటా, సియామ్ సిమెంట్‌లో 33 శాతం వాటాలు ఆయనకే ఉన్నాయి. ప్రపంచంలోని ధనిక రాజుల జాబితాలో థాయ్‌లాండ్ రాజు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. తర్వాత వరుసలో బ్రూనై సుల్తాన్.. సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఉన్నారు. అబుదాబీ, దుబాయ్, ఖతార్ పాలకులు కూడా బిలియన్ డాలర్ల ఆస్తులతో విలాసవంత జీవన విధానాన్ని గడుపుతున్నారు.
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
ఇక నుంచి డీలర్ వద్దే రిజిస్ట్రేషన్
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
కుంగుతున్న నగరాలు! మునుగుతున్న పట్టణాలు
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
