అద్భుత ఆవిష్కరణ.. కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే!
టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తుంటే మరికొందరు అదే టెక్నాలజీ సాయంతో తమలోని ప్రతిభకు మరింత పదును పెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా బీహార్‌కు చెందిన ఓ కుర్రాడు అద్భుత ఆవిష్కరణ చేశాడు.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో, తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ జీప్‌ను తయారు చేసి సంచలనం సృష్టించాడు. గ్రామాల్లో ఉండే రైతులు, చిన్న వ్యాపారుల రోజువారీ ప్రయాణాలకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా ఈ వాహనాన్ని తయారుచేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
బీహార్‌లోని పూర్నియాకు చెందిన ముర్షీద్ ఆలం ఒక సాధారణ మెకానిక్. గ్యారేజీలో వాహనాలను రిపేర్ చేసేవాడు. కొన్నాళ్లకు సొంతంగా షాప్ పెట్టుకుని మంచి మెకానిక్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆలం అక్కడితో ఆగిపోలేదు. తనలోని ప్రతిభకు పదును పెట్టాడు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో పట్టు సాధించాడు. ఈ క్రమంలోనే పూర్తి స్వదేశీ టెక్నాలజీతో, తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ జీప్‌ను తయారు చేసి సంచలనం సృష్టించాడు. గ్రామాల్లో ఉండే రైతులు, చిరు వ్యాపారుల రోజువారీ ప్రయాణాలకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడేలా, తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసుకునేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఈ వాహనం తయారు చేశాడు. గ్రామస్థుల అవసరాలకు అనుగుణంగా..ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీప్‌ను కేవలం 18 రోజుల్లో తయారు చేశాడు. ఈ జీప్‌నకు ప్రత్యేకంగా ఒక ట్రాలీని కూడా అమర్చుకునే ఏర్పాటు చేశాడు. ఈ వాహనంతో రైతులు పంటలు, ఎరువులు, ఇతర సామాగ్రిని కూడా రవాణా చేసుకోవచ్చు . ఈ జీప్‌ను ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ జీప్ ఖరీదు కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఈ జీప్‌నకు నాలుగు ట్యూబ్‌లెస్ టైర్లు, స్పీడోమీటర్, ఛార్జింగ్ పాయింట్, పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు ఈ జీప్‌ను డ్రైవింగ్ చేయడం కూడా చాలా సులభం. ఈ జీప్ తయారు చేసిన ముర్షీద్‌పై స్థానికులు, నెటిజన్లు ప్రశంసలు కురుస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
అద్భుత ఆవిష్కరణ.. కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే!
అద్భుతం..సూర్యకాంతితో షుగర్ కంట్రోల్ ఎలా అంటే?
549 రైళ్ల వేగాన్ని పెంచిన రైల్వే శాఖ
బాబా వంగా జోస్యం.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? వీడియో
500 మందికి దుప్పట్లు పంచిన బికారి
ఆ దేశంలో సడెన్‌గా కరెంట్ కోత.. అసలు ఏం జరుగుతుందంటే?
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
