ఈ ఆలయం సేవల్లో ఏకంగా 363 మంది మహిళలు
గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయం గురించి అందరికీ తెలిసిందే. భారతదేశంనుంచే కాకుండా దేశవిదేశాలనుంచి భక్తులు సోమనాథ్ ఆలయానికి వస్తారు. అయితే ఈ ఆలయం కేవలం సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక చైతన్యానికి మాత్రమే పరిమితం కాకుండా మహిళాసాధికారతకు శక్తివంతమైన కేంద్రంగా మారింది. ఆలయ పరిపాలన నిర్వహణకు నోడల్ బాడీ అయిన సోమనాథ్ ట్రస్ట్, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. వీరిలో 350 మందికి పైగా మహిళలు ఈ ఆలయంలో బహుళ సేవలలో నిమగ్నమై ఉన్నారు.
ఆలయ నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రసాద పంపిణీ, భోజన సేవ వంటి వివిధ విభాగాల్లో వందలాది మంది మహిళలు పని చేస్తున్నారు. ప్రస్తుతం, సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌లో మొత్తం 906 మంది ఉద్యోగులు సేవలను అందిస్తున్నారు. వీరిలో 262 మంది మహిళలు ఉన్నారు. ఇక ఆలయ ప్రాంగణంలోని బిల్వ అడవిని పూర్తిగా మహిళలు నిర్వహిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న 16 మంది మహిళలు పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలు, పరిశుభ్రతపై దృష్టి సారించడం ద్వారా ఆలయ పవిత్రతను కాపాడుతున్నారు. ఈ ఏర్పాటు సమర్థవంతమైన నిర్వహణకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇక ఆలయ భోజనశాలలో సుమారు 30 మంది మహిళలు సేవలందిస్తున్నారు. ప్రసాదం పంపిణీ కేంద్రం వద్ద 65 మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద, సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ద్వారా 363 మంది మహిళలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ మహిళలు స్థిరమైన ఆదాయాన్ని పొందడం ద్వారా వారి ఆర్థిక స్వాతంత్రానికి మద్దతు లభిస్తోంది. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఆలయ సేవలో మహిళలను భాగస్వాములను చేయడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
ఈ ఆలయం సేవల్లో ఏకంగా 363 మంది మహిళలు
అద్భుత ఆవిష్కరణ.. కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే!
అద్భుతం..సూర్యకాంతితో షుగర్ కంట్రోల్ ఎలా అంటే?
549 రైళ్ల వేగాన్ని పెంచిన రైల్వే శాఖ
బాబా వంగా జోస్యం.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? వీడియో
500 మందికి దుప్పట్లు పంచిన బికారి
ఆ దేశంలో సడెన్గా కరెంట్ కోత.. అసలు ఏం జరుగుతుందంటే?
