బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
పళ్లు తోముకుంటుండగా ఛత్తీస్‌గఢ్ వ్యక్తి మెడలోని కరోటిడ్ ధమని చిట్లి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయే ప్రమాదంలో, డా. కృష్ణకాంత్ సాహు బృందం సవాలుతో కూడిన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలో 10, ఛత్తీస్‌గఢ్‌లో తొలి కేసు కావడంతో ఇది వైద్య చరిత్రలో అరుదైన అద్భుతం.
ఓ వ్యక్తి పళ్లు తోముకోవడం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి పళ్లు తోముకుంటుండగా అకస్మాత్తుగా అతని మెడలోని ప్రధాన రక్తనాళం చిట్లిపోయి, గొంతులో తీవ్రమైన నొప్పి రావడంతో పాటు మెడ భాగం బాగా ఉబ్బిపోయింది. తర్వాత కొన్ని నిమిషాల్లోనే అతడు స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి డాక్టర్లు చరిత్ర సృష్టించారు. వైద్యులు వెంటనే బాధితుడ్ని హార్ట్, చెస్ట్, వాస్కులర్ సర్జరీ విభాగానికి తరలించి సర్జరీ మొదలుపెట్టారు. కానీ, ఇది సవాళ్లతో కూడుకున్న సున్నితమైన ఆపరేషన్. మెడ నరాలు ఉబ్బిపోవడంతో గుండెకు సరఫరా చేసే రక్త నాళాన్ని గర్తించడం వారికి కష్టమైంది. పేషెంట్ మెడ భాగంలోని గడ్డ కట్టిన రక్తం మెదడుకు చేరితే పక్షవాతం లేదా ప్రాణాలు కోల్పోయే అవకాశముందని డాక్టర్లు వివరించారు. డాక్టర్ కృష్ణకాంత్ సాహు నేతృత్వంలోని బృందం ఎంతో నైపుణ్యంతో చిట్లిపోయిన రక్తనాళాన్ని సరిచేసి, ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. కరోటిడ్ ధమని అనేది మెడకు రెండు వైపులా ఉన్న ఒక ప్రధాన ధమని, ఇది గుండె నుంచి మెదడుకు రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. కరోటిడ్ నాళం చీలిపోవడం లేదా దెబ్బతినడం ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు. ఏ అనారోగ్యం లేని వ్యక్తికి పళ్లు తోముకుంటుండగా ఉన్నట్లుండి నరం చిట్లడం వైద్య చరిత్రలోనే అత్యంత అరుదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కేసులు నమోదు కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే ఇది మొదటి కేసు.
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
