అమ్మానాన్నల్ని ఫస్ట్‌టైమ్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరు
మధ్య తరగతి కుటుంబాలకు విమాన ప్రయాణం అంటే విలాసవంతమైందే. ఆకాశంలో విహరించేందుకు సంవత్సరాల తరబడి వేచి ఉండటం, అందుకనుగుణంగా డబ్బులు దాచుకోవడంతోపాటు కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. నెటిజన్లను కదిలించిన ఓ భావోద్వాగ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌వుతోంది. విష్ణు అనే యువకుడు తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసాడు.
ఆ అనుభూతిని ఎలాంటి ఫిల్టర్లు, సౌండ్‌ట్రాక్‌లు లేకుండా చాలా సాదా సీదాగా, అత్యంత హృద్యంగా ఆ క్షణాలను వీడియో తీశాడు. ప్రతీ కొడుకు స్వప్నం నెరవేరిన క్షణం ఇది అనీ కాప్షన్ ఇచ్చాడు. సెక్యూరిటీ చెకప్ నుంచి, గేటులోకి ఎంట్రీ ఇవ్వడం, విమానం ఎక్కడం, చివరగా విమానంలో కూర్చునే దాకా తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. విష్ణు సెంటిమెంట్‌తో సోషల్ మీడియా యూజర్లు బాగా కనెక్ట్ అయ్యారు. “స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదే అంటూ విష్ణుకు అభినందనలు తెలిపారు. గ్రేట్ బ్రో.. ఇది కదా ఆనందం అంటే , “ఇది ప్రతి మధ్యతరగతి మనిషి కల” చిన్నప్పటి నుంచీ కష్టపడి పెంచి, చదివించిన వారికి మనం రుణపడి ఉంటాం అంటూ కామెంట్లతో ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
అమ్మానాన్నల్ని ఫస్ట్‌టైమ్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరు
నువ్వే కావాలి .. భర్త ఇంటి ముందు భార్య నిరసన
ఈ ఆలయం సేవల్లో ఏకంగా 363 మంది మహిళలు
అద్భుత ఆవిష్కరణ.. కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే!
అద్భుతం..సూర్యకాంతితో షుగర్ కంట్రోల్ ఎలా అంటే?
549 రైళ్ల వేగాన్ని పెంచిన రైల్వే శాఖ
బాబా వంగా జోస్యం.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? వీడియో
