AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం..సూర్యకాంతితో షుగర్‌ కంట్రోల్‌ ఎలా అంటే?

అద్భుతం..సూర్యకాంతితో షుగర్‌ కంట్రోల్‌ ఎలా అంటే?

Samatha J
|

Updated on: Jan 13, 2026 | 10:41 AM

Share

చలికాలంలో సూర్యకాంతి వెచ్చదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి సూర్యరశ్మి అంతే అవసరం. ఆహారం నుంచి శక్తిని పొందితే, సూర్యకాంతి నుంచి విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. డయాబెటిస్‌ ఉన్న వారిలో షుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉండటానికి సూర్య కాంతి అద్భుతంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తెలిసింది.

విటమిన్ డి ఎముకల పెరుగుదల, బలానికి అవసరమవుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. శీతాకాలంలో ప్రతిరోజూ కొంత సమయం సూర్యరశ్మిలో గడపడం అవసరం. రోజంతా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండకుండా, కాసేపు బయటకు వచ్చి సూర్యకాంతిలో నిలబడే టైప్‌-2 డయాబెటిస్‌ రోగులకి షుగర్‌ లెవెల్స్‌ పెరగకుండా ఉంటుందని నెదర్లాండ్స్‌లో జరిపిన అధ్యయనంలో తెలిసింది. చాలా మంది నేడు ఇంట్లో కృత్రిమ కాంతి మధ్య గడుపుతున్నారని జీవక్రియలు అదుపు తప్పకుండా చేయడంలో సూర్యకాంతి బలంగా పనిచేస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఇవో హాబెట్స్‌ తెలిపారు. కృత్రిమ కాంతిలో ఇంట్లో ఉన్న వారికి, సూర్యకాంతి కోసం కాసేపు ఎండలో నిలబడే వారిలో డయాబెటిస్‌ ముప్పు ఎలా ఉంటుందన్న అంశాలపై తమ అధ్యయనం దృష్టి సారించిందని పరిశోధకులు తెలిపారు. ఆఫీస్‌ టైమింగ్స్‌లో కొందరిని కృత్రిమ కాంతి, సూర్య కాంతికి గురిచేసి, వారి రక్తంలో చక్కెర్‌ స్థాయిల్ని సైంటిస్టులు నమోదుచేశారు. సూర్యకాంతిలో ఎక్కువ సమయం గడిపినవారి షుగర్‌ స్థాయిలు పూర్తిగా నియంత్రణలో ఉండటాన్ని గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం