AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Feet: పాదాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటే.. ఈ ప్రమాదకర వ్యాధి మీ ఒంట్లో చేరినట్లే!

కొందరికీ సాక్స్ ధరించి మందపాటి దుప్పటి కప్పుకున్నప్పటికీ పాదాలు వేడెక్కవు. దీనిని వాతావరణ ప్రభావంగా భావించి విస్మరించే వారు చాలా మందే ఉన్నారు. కొన్నిసార్లు ఈ రకమైన లక్షణం అనారోగ్యానికి సంకేతంగా కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును, ఇది డయాబెటిస్ లక్షణం..

Cold Feet: పాదాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటే.. ఈ ప్రమాదకర వ్యాధి మీ ఒంట్లో చేరినట్లే!
Cold Feet And Diabetes
Srilakshmi C
|

Updated on: Jan 13, 2026 | 1:03 PM

Share

చలిలో పాదాలు సాధారణంగా చల్లబడతాయన్న సంగతి తెలిసిందే. అయితే కొందరికీ సాక్స్ ధరించి మందపాటి దుప్పటి కప్పుకున్నప్పటికీ పాదాలు వేడెక్కవు. దీనిని వాతావరణ ప్రభావంగా భావించి విస్మరించే వారు చాలా మందే ఉన్నారు. కొన్నిసార్లు ఈ రకమైన లక్షణం అనారోగ్యానికి సంకేతంగా కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును, ఇది డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు. కానీ డయాబెటిస్ మాత్రమే పాదాలు చల్లబడటానికి కారణం కాదు. ఎవరికైనా చాలా కాలంగా పాదాలు చల్లబడే సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండటం అవసరం. అలసిలా ఎందుకు జరుగుతుందంటే?

శీతాకాలంలో పాదాలు చల్లబడితే డయాబెటిస్ వస్తుందా?

లేడీ హార్డింజ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఎల్‌హెచ్ ఘోటేకర్ ఏం చెబుతున్నారంటే.. డయాబెటిస్ రక్తంలో అధిక చక్కెర స్థాయిల కారణంగా నరాలు, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దీని వలన పాదాలలో తిమ్మిరి, జలదరింపు, మంట, చలి అనుభూతి, పాదాలలో నొప్పి, పొడి చర్మం, గాయాలు నెమ్మదిగా మానడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో రక్త ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది. అయితే పాదాలు చల్లగా ఉండటం వల్ల మీకు డయాబెటిస్ ఉందని అర్థం కాదు. అయితే దీనితో పాటు అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువులో మార్పులు వంటి లక్షణాలు ఉంటే సంబంధిత రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

రక్త ప్రసరణ సరిగా లేకపోతే పాదాలు చల్లబడతాయా?

పాదాలు చల్లబడటం మధుమేహానికి సంకేతం మాత్రమే కాదు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి కూడా సంకేతం. పాదాలకు తగినంత రక్తం చేరనప్పుడు, అవి చల్లగా అనిపించడం ప్రారంభిస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, వృద్ధాప్యం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. సాధారణంగా శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్త ప్రసరణ తగ్గిస్తుంది. ఫలితంగా పాదాల చర్మం చల్లగా, కొద్దిగా నీలం రంగులో కనిపిస్తాయి. కొన్నిసార్లు తేలికపాటి నొప్పి లేదా తిమ్మిరి కూడా ఉండవచ్చు. కానీ పాదం బరువుగా ఉండి నడవడానికి ఇబ్బందిగా ఉంటే దానిని విస్మరించకూడదు.

ఇవి కూడా చదవండి

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?

  • మీ పాదాలను వీలైనంత వెచ్చగా ఉంచుకోవాలి.
  • ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్‌ చేయాలి.
  • ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవద్దు.
  • మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ ఉండాలి.
  • పొగ తాగకూడదు.
  • మీ పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.