AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

మన శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం. అదేవిధంగా సరైన సమయంలో, సరైన పరిమాణంలో నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా మనం దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాం. అంతేకాకుండా చాలా మందికి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది..

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Drinking Water Immediately After Meal
Srilakshmi C
|

Updated on: Jan 13, 2026 | 1:25 PM

Share

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు ఆరోగ్య దృక్కోణం నుండి మంచిది కాదు. ఈ అలవాటు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి తిన్న తర్వాత ఎంతసేపటి తర్వాత నీళ్లు తాగాలో ఇక్కడ తెలుసుకుందాం..

తిన్న తర్వాత ఎంతసేపటికి నీళ్లు తాగాలి?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారం జీర్ణం కావడానికి కనీసం రెండు గంటలు పడుతుంది. ఈ సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తిన్న 45 నుంచి 60 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిది. తినడానికి ముందు నీళ్లు తాగాలనుకుంటే, భోజనానికి అరగంట ముందు తాగడం మంచిది. ఇది శరీరం ఆహారంలోని పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది.

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే

ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది

మన శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఈ జీర్ణ రసాలు బలహీనపడతాయి. వాటి ప్రభావం తగ్గుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

కడుపులో బరువుగా అనిపించడం

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల ఆహారం కడుపులో ఎక్కువసేపు ఉంటుంది. ఫలితంగా కడుపులో బరువుగా అనిపించడం, ఉబ్బరం, ఆమ్లత్వం పెరుగుతుంది.

బరువు పెరగడం

ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది మీ జీవక్రియను నెమ్మదింపజేస్తుంది. ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి దారితీస్తుంది.

పోషకాల శోషణ తగ్గడం

ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, శరీరం ఆహారం నుంచి పొందే పోషకాలను పూర్తిగా గ్రహించలేకపోతుంది. ఇది దీర్ఘకాలంలో విటమిన్, ఖనిజ లోపాలకు దారితీస్తుంది.

సరైన సమయంలో నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది
  • బరువు అదుపులో ఉంటుంది. ఊబకాయం పెరగదు.
  • జీర్ణక్రియ బలపడి కడుపు తేలికగా అనిపిస్తుంది.
  • గ్యాస్, అసిడిటీ సమస్య ఉండదు.
  • శరీరం ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.
  • నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. శరీరం మరింత రిలాక్స్ అవుతుంది.
  • భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం హానికరం. సరైన సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఊబకాయం,
  • ఆమ్లత్వం, ఉబ్బరం వంటి సమస్యలను కూడా నివారించవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.