Health: రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
జుట్టు సమస్యలకు గట్ ఆరోగ్యం, పోషకాహార లోపాలు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యారెట్, బీట్‌రూట్, యాపిల్, ఉసిరికాయ, కరివేపాకులతో చేసిన ఈ జ్యూస్ తాగడం వల్ల విటమిన్ B12, ఐరన్, విటమిన్ D లోపాలు పోయి.. తెల్ల జుట్టు, జుట్టు రాలడం లాంటి సమస్యలు తగ్గి.. జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందన్నారు.

జుట్టు ఆరోగ్యం, చర్మ సౌందర్యం మనందరికీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మన శరీరంలోని గట్ ఆరోగ్యం జుట్టు పెరుగుదల, రంగు, బలాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా.! ఇటీవల కాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు, జుట్టు రాలడం, బట్టతల, స్ప్లిట్ ఎండ్స్ లాంటి సమస్యలు పెరిగిపోవడానికి గట్ ఆరోగ్యం సరిగా లేకపోవడం, పోషకాహార లోపాలు ప్రధాన కారణాలని నిపుణులు అంటున్నారు. మనం తినే ఆహారం జీర్ణాశయం నుంచి గట్(చిన్న పేగు, పెద్ద పేగు)లోకి వెళ్తుంది. అక్కడే శరీరానికి అవసరమైన పోషకాలు గ్రహిస్తుంది. గట్ ఆరోగ్యం సరిగా లేకపోతే, పోషకాలు సరిగా అబ్సార్బ్ అవ్వవు. దీనివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏర్పడి, జుట్టు సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ B12, ఐరన్, విటమిన్ D లోపాలు తెల్ల జుట్టు, జుట్టు రాలడానికి ప్రధాన కారకాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఒత్తిడి కూడా గట్ శుభ్రంగా లేకపోవడం వల్ల ప్రారంభమవుతుందన్నారు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
జుట్టు సమస్యల కోసం కేవలం షాంపూలు, నూనెలపై ఆధారపడటం సరైనది కాదని. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. రసాయన రహిత, ఆయుర్వేద ఉత్పత్తులను ఎంచుకోవడం కొంతవరకు మేలు చేసినా, అసలైన పరిష్కారం అంతర్గత పోషణలోనే ఉంటుందన్నారు. పూర్వకాలంలో ప్రజలు ప్రాసెస్ చేసిన ఆహారాలు తక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు బలంగా ఉండేది. ఇప్పుడు ప్రాపర్ ఫుడ్ లేకపోవడం, గట్ అనారోగ్యం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. పోషకాహార లోపాలను తీర్చడానికి, జుట్టు సమస్యలను నివారించడానికి ఒక ప్రత్యేకమైన జ్యూస్‌ను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ జ్యూస్‌లో క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్, ఉసిరికాయ ముక్క, కొద్దిగా కరివేపాకు ఆకులను ఒక గ్లాసు నీటితో కలిపి మిక్సీ పట్టి, గుజ్జును పిండి రోజు తాగాలి. ఈ పదార్థాలన్నీ విటమిన్ B12, ఐరన్, విటమిన్ D లాంటి ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా తెల్ల జుట్టు రాకుండా నివారించవచ్చు, జుట్టు రాలడం ఆగిపోతుంది, జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది. కాగా, ఏదైనా డైట్ ఫాలో అవ్వాలనుకుంటే కచ్చితంగా మీ డాక్టర్‌ను ముందుగా సంప్రదించండి.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




