AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా నేలరాలుతున్న కాకులు..ఏం జరిగింది

గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా నేలరాలుతున్న కాకులు..ఏం జరిగింది

Samatha J
|

Updated on: Jan 13, 2026 | 11:46 AM

Share

గాల్లో హాయిగా ఎగురుతున్న కాకులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. అసలేమైంది ఈ కాకులకి? ఉన్నట్టుండి ఎందుకు ఇలా నేలరాలుతున్నాయి.. ఇదే ఆందోళన నెలకొంది చెన్నైలోనే అడయారు ప్రాంత ప్రజల్లో. ఎగురుతూ ఎగురుతూ ఒక్కసారిగా కాకులు నేలబడి చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని అడయారు ప్రాంతంలోరి ఇందిరానగర్‌ పార్కులో కొన్ని రోజులుగా.. ఎగురుతున్న కాకులు అకస్మాత్తుగా నేలపై పడిపోతున్నాయి.

ఎగరలేని పరిస్థితిలో ఉంటూ అవి ఒకట్రెండు రోజుల్లో చనిపోతున్నాయి. ఇదేదో వైరస్‌ వల్ల జరుగుతుందేమోనని, తమకు కూడా హాని కలుగుతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెన్నై మహానగర పాలకసంస్థ అధికారులు చనిపోయిన కాకులను పరీక్షల నిమిత్తం తమిళనాడు యూనివర్సిటీ ఆఫ్‌ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ కు పంపారు. విషాహారం, కలుషిత నీరు తాగటం వాటి మరణానికి కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. అనుమానాస్పదంగా మరణించిన ఘటనలు అడయారు పరిసరాల్లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ జరిగినట్లు జీసీసీ పశుసంవర్ధక విభాగ అధికారి ఒకరు తెలిపారు. అనుమానాస్పదంగా మరణించిన కాకులను తాకే ప్రయత్నం చేయవద్దని ప్రజలను జీసీసీ హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం