వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక శాంతి లభించాల్సిన చోట పాముల భయం వెంటాడుతోంది. దేవస్థానం ఆధీనంలోని వసతి గృహాలు, సత్రాలు, ఆలయ పరిసరాల్లో తరచూ పాములు ప్రత్యక్షమవుతుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పార్వతిపురం ధర్మశాల కార్యాలయంలో నాగుపాము ప్రత్యక్షం కావడం అలజడి చెలరేగింది.
కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీయగా, అధికారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును పట్టుకుని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో అప్పటికి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నప్పటికీ, అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, వసతి గృహల వద్ద తరచూ పాములు దర్శనమవుతుండటం భక్తులను వణికిస్తోంది. దర్శనానికి వచ్చే భక్తులు, వసతి గృహాల్లో బస చేసే యాత్రికులు రాత్రివేళ బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికుల మాటల్లో ఆలయ పరిసరాల్లోని పాత భవనాలు, పాడైపోయిన నిర్మాణాలు, చెత్త పేరుకుపోవడం, పాములకు ఆలయ పరిసరాలను సురక్షిత ఆశ్రయంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. దేవస్థానం పరిధిలో భక్తుల ప్రాణ భద్రతకు హామీ ఇవ్వాల్సిన అధికారులు ఇప్పటికైనా మేల్కొనాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

