TOP 9 ET: బంగ్లాదేశ్ లో తెలుగు ప్రజల రక్షకుడిగా NTR | అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ బిగ్ ప్లాన్.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల ముహూర్తం కూడా షూరు అయిన ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్ నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. అక్కడున్న తెలుగువారికి అండగా నిలిచే వ్యక్తిగా తారక్ కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది నీల్ సెట్స్ లో జాయిన్ అవుతారు తారక్.
01.NTR: బంగ్లాదేశ్ లోతెలుగు ప్రజల రక్షకుడిగా NTR
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల ముహూర్తం కూడా షూరు అయిన ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్ నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. అక్కడున్న తెలుగువారికి అండగా నిలిచే వ్యక్తిగా తారక్ కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది నీల్ సెట్స్ లో జాయిన్ అవుతారు తారక్.
02.POWERSTAR: డ్యూయట్ సాంగ్ చేస్తున్న డిప్యూటీ సీఎం సాబ్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పవన్, నిధి మీద కీలక సన్నివేశాలతోపాటు ఓ పాటను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు డైరక్టర్ జ్యోతికృష్ణ. వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది హరిహరవీరమల్లు.
03.Goat: OTTలోకి గోట్ వచ్చేస్తుందోచ్..
దళపతి విజయ్ నటించిన సినిమా ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. సింహం గోట్‌గా మారడాన్ని ఎప్పుడైనా చూశారా అంటూ గోట్ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. అక్టోబర్ 3న దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ గోట్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్.
04.Karthi : మహేష్ , నేను స్కూల్లో క్లాస్‌మేట్స్
సరైన కథ కుదిరితే సూపర్‌స్టార్ మహేష్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు హీరో కార్తి. చెన్నైలో మహేష్, తాను కలిసి చదువుకున్నామని, క్లాస్‌మేట్స్ అనీ చెప్పారు. కార్తి, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం ఇటీవల విడుదలైంది. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
05. Game Changer: రా మచ్చా.. పాటలో స్పెషల్ సర్‌ప్రైజ్
చాలా రోజులుగా ఊరిస్తున్న గేమ్ ఛేంజర్ రెండో పాట వచ్చేసింది. జరగండి జరగండి పాటతో కాస్త నిరాశపడ్డ ఫ్యాన్స్.. ఇది చూసాక ఖుషీ అవుతున్నారు. ఏదో హీరో ఇంట్రో సాంగ్ మాదిరి కాకుండా.. ఈ పాటను చాలా కొత్తగా డిజైన్ చేసారు శంకర్. మరీ ముఖ్యంగా ఇండియాలోని విభిన్నమైన సంస్కృతులను ఒకే పాటలో చూపించే ప్రయత్నం చేసారు ఈ దర్శకుడు.
06.Mithun Chakraborty: కంగ్రాట్స్ మిథున్..
ఇండియాలో సినిమా వాళ్లకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక అవార్డు బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. అక్టోబర్ 8న జరగనున్న నేషనల్ అవార్డ్స్ ప్రజెంటేషన్ ఈవెంట్‌లో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. ఈయనకు పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
07. Unstoppable: మళ్లీ మొదలవుతున్న అన్‌స్టాపబుల్
బాలకృష్ణ హోస్టుగా వస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్ 4 త్వరలోనే మొదలు కానుంది. ఈ సారి సీజన్ ను ఇంకా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది ఆహా టీం. ఈ క్రమంలోనే సినీ రాజకీయ ప్రముఖులు అన్‌స్టాపబుల్ సీజన్ 4కి రానున్నారు. కొత్త సీజన్‌కు లక్కీ భాస్కర్ టీం రాబోతుంది. అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య షోకు ప్రమోషన్ కోసం వచ్చారు.
08. Trivikram: అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ బిగ్ ప్లాన్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాపై మరో అప్‌డేట్ వచ్చింది. గుంటూరు కారం విడుదలకు ముందే.. ఈ సినిమా అనౌన్స్ చేసారు. కాకపోతే ఈసారి రొటీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాకుండా.. పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారు గురూజీ. అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా టైమ్ తీసుకుంటున్నారు. పీరియాడిక్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. 2025 జూన్ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
09.ANANYA: మాటలు లేని చోట.. రొమాన్స్ ఎలా ఉంటుంది.?
తనకూ, శుభ్‌మన్ గిల్‌కీ మధ్య మాటలు కూడా లేవన్నారు నటి అనన్య పాండే. మాటలే లేని చోట రొమాన్స్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తామిద్దరం కలిసి ఓ యాడ్ చేశామని, అంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ ఉందని అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. బేసిక్ గా తామిద్దరం చాలా డిఫరెంట్ వ్యక్తులమని తెలిపారు అనన్య.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.