NTR-Devara: ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సోలోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే దేవర సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. తొలి మూడు రోజుల్లో కూడా భారీగానే వసూళ్లు రాబట్టింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమా దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసిన దేవర హంగామానే కనిపిస్తుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సోలోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే దేవర సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. తొలి మూడు రోజుల్లో కూడా భారీగానే వసూళ్లు రాబట్టింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమా దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసిన దేవర హంగామానే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల్లోనూ దేవర సినిమా మేనియా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో యక్ట్ చేశాడు. అలాగే దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. వీరి జోడీ.. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించి మెప్పించాడు. దేవర సినిమాను రెండు భాగాలుగా ఉంటుంది. అందులో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు వచ్చింది. తొలి పార్ట్‌లో చాలా ట్విస్ట్ లు ఉంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాడు దర్శకుడు కొరటాల.
దేవర సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లు వసూలు చేసింది. అలాగే సెకండ్ డే వరకు వరల్డ్ వైడ్ గా రూ.249 కోట్లు వసూల్ చేసింది. అదే విధంగా మూడు రోజులకు కలిపి రూ. 304 కోట్లు వచ్చాయి. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక దేవర సినిమాలో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, మురళి శర్మ, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. అలాగే సముద్రంలోని సన్నివేశాలు, సొర చేప సీన్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించాయి.
ఇక దేవర తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన ఓపెనింగ్స్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి రోజున 100 కోట్ల కలెక్షన్ దాటాలని ఎన్టీఆర్ భావించారని.. ఇప్పుడు అనుకున్నది సాధించారని ఫిలింనగర్ టాక్ చెబుతోంది. పైగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనూ భారీ స్పందన రావడంతో.. సినిమా అన్ని రకాలుగా హిట్ అయినట్టేనంటున్నాయి సినీ వర్గాలు. సో.. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో దేవర తన పవరేంటో చూపించాడు. ఇప్పుడు రెండో పార్ట్ పై అభిమానుల్లో క్యూరియాసిటీతో పాటు ఎక్స్ పెక్టేషన్స్ ను కూడా పెంచేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.