AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 : పాపం మణికంఠ.. శక్తి టీమ్ నుంచి కూడా పక్కన పెట్టేశారు..

హౌస్ లో 12 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుందని.. ఆ ఎంట్రీలను ఆపేందుకు హౌస్ లో ఉన్నవారికి ఇచ్చిన టాస్క్ లు విన్ అవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల్లో విన్ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు మూడు వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపారు ఇంటి సభ్యులు.

Bigg Boss 8 : పాపం మణికంఠ.. శక్తి టీమ్ నుంచి కూడా పక్కన పెట్టేశారు..
Manilkanta
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2024 | 8:22 AM

Share

బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ ఒక్కడే అయిపోయాడు. హౌస్‌లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మనోడికి కష్టాలే కష్టాలు. గత వారం మనోడు నిఖిల్ టీమ్ నుంచి సీత టీమ్ లోకి వచ్చాడు. అయినా కూడా మనోడి కష్టాలు తీరలేదు. ఇక హౌస్ లో 12 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుందని.. ఆ ఎంట్రీలను ఆపేందుకు హౌస్ లో ఉన్నవారికి ఇచ్చిన టాస్క్ లు విన్ అవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల్లో విన్ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు మూడు వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపారు ఇంటి సభ్యులు. ఇక ఇప్పుడు ఇచ్చిన టాస్క్ లు గెలిస్తే ప్రైజ్ మని .. ఓడిపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ యాడ్ అవుతుందని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో భాగంగా ముందుగా తాళం విడిపించు.. టైర్‌ను నడిపించు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమింగ్ ఫుల్ లో ఉన్న తాళం వేసున్న టైర్లను తీసుకెళ్లి స్లాట్ లో వేయాలి.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

ఎవరైతే ముందుగా ఆ టైర్స్ ను తీసుకెళ్తారో వారే విన్నర్. ఈ గేమ్ కోసం శక్తి టీమ్ నుంచి నిఖిల్.. కాంతార టీమ్  నుంచి విష్ణు ప్రియా పాల్గొన్నారు. అలాగే ఈ గేమ్ కు నైనిక సంచాలక్‌గా వ్యవహరించింది. ఈ గేమ్ లో ఇద్దరూ ఓడిపోయారు. ఇద్దరూ ఓడిపోయారు కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని యాడ్ చేసినట్లు బిగ్‌బాస్ చెప్పాడు. ఆతర్వాత మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. జాగ్రత్తగా నడు.. లేకపోతే పడతావ్ అనే టాస్క్ ఇచ్చాడు . అప్ అండ్ డౌన్ మీదుగా వెళ్లి బాల్స్ ను బాస్కెట్ లో వేయాలి. శక్తి నుంచి మణికంఠ, కాంతార టీమ్ నుంచి యష్మి పాల్గొన్నారు. ఈ గేమ్‌లో యష్మీ గెలిచింది. మణికంఠ ఓడిపోయాడు. నిఖిల్ టీమ్ గెలవడంతో ప్రైజ్ మనీకి లక్షన్నర యాడ్ అయ్యింది అలాగే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాడు బిగ్‌బాస్. కాంతార క్లాన్ ఓడిపోయినందుకు  ఆ టీమ్ నుంచి ఒకరిని తప్పించాలని బిగ్ బాస్ చెప్పాడు.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

సీత తన క్లాన్ సభ్యులతో మీటింగ్ పెట్టింది. నైనికా నామినేషన్స్ లో ఉన్నవారిని తీయ్యొద్దు అని చెప్పింది. ప్రేరణకి హెల్త్ బాలేదు కాబట్టి తనని తీసేయండి అంటూ మణికంఠ చెప్పుకొచ్చాడు. నబీల్, విష్ణుప్రియ సీతను పక్కన పెట్టడం బెటర్ తనకు ఈ వారం ఇమ్యూనిటీ ఉంది అని చెప్పారు. తానే తప్పుకుంటానని సీత టీమ్ మెట్స్ దగ్గర చెప్పింది. కానీ బిగ్ బాస్ దగ్గరకు వెళ్లి మణికంఠ పేరు చెప్పింది. దాంతో మనోడు మూలకు వెళ్లి ఎప్పటిలానే బాధపడ్డాడు. కొంచెం బాధ ఉంది బిగ్‌బాస్ ఇంకో టాస్కు ఆడితే బావున్ను.. సర్లే రోషం తెచ్చుకొని ఆడతా బిగ్‌బాస్ అని బిగ్ బాస్ కు చెప్పుకున్నాడు.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?