AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంక్‌లు బంద్.. కారణం ఇదే..

ఈ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు వచ్చాయి. జనవరి 15వ తేదీన సంక్రాంతి, జనవరి 16న కనుమ సందర్భంగా బ్యాంకులన్నీ మూసివేయనున్నారు. ఇక జనవరి 24 నుంచి వరుసగా నాలుగు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంక్‌లు బంద్.. కారణం ఇదే..
Banks holidays
Venkatrao Lella
|

Updated on: Jan 13, 2026 | 12:56 PM

Share

సంక్రాంతి పండుగ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవు లిస్ట్‌ను ముందుగానే ప్రకటించింది. రాష్ట్రాల్లోని స్థానిక పండుగలను బట్టి సెలవులు మారుతూ ఉంటాయి. ఆర్బీఐనే కాకుండా స్థానిక ప్రభుత్వాలు కూడా ప్రత్యేక రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఇస్తూ ఉంటాయి. దీంతో ఏపీ, తెలంగాణలో బ్యాంక్ సెలవులపై కన్‌ప్యూజన్ నెలకొంది. పండుగ ఎప్పుడనేది అమోమయం నెలకొన్న తరుణంలో బ్యాంకులు ఏ రోజు పనిచేస్తాయి..? ఏ రోజు బంద్ అవుతాయి? అనే ప్రశ్నలు ఖాతాదారులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వేళ ఏయే రోజుల్లో బ్యాంకులు ఉంటాయి..? ఏయే రోజుల్లో మూసివేస్తారు? అనే విషయాలు తెలుసుకుందాం.

ఏపీ, తెలంగాణలో మార్పులు

ఏపీ, తెలంగాణలో బ్యాంకు సెలవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. ఇక ఏపీలో జనవరి 16న కనుమ సందర్భంగా కూటమి ప్రభుత్వం బ్యాంకులకు సెలవు ప్రకటించింది. బ్యాంక్ సంఘాలు వినతితో ఆ రోజు సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఊరువాడా చాలా గ్రాండ్‌గా వేడుకలు జరుగుతాయి. ఈ సారి కనుమ సెలబ్రేషన్స్ కూడా అట్టహాసంగా జరగనున్నాయి. దీంతో జనవరి 16న సెలవు దినంగా ప్రకటించాలని బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఏపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. పండుగ సెలబ్రేషన్స్ అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో జనవరి 15,16 రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. తిరిగి జనవరి 17న తెరుచుకోనున్నాయి.

తెలంగాణలో ఆ ఒక్కరోజే

తెలంగాణలోని బ్యాంకులు ఒక్కరోజు మాత్రమే మూతపడనున్నాయి. జనవరి 15న సంక్రాంతి రోజు మాత్రమే క్లోజ్ కానున్నాయి. జనవరి 16న యథావిధిగా పనిచేయనున్నాయి. ఏపీ, తెలంగాణలోని కస్టమర్లు ఈ మార్పులను గమనించి తమ లావాదేవీలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నెలలో జనవరి 24న రెండో శనివారం, జనవరి 25న ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు జనవరి 24 నుంచి 27వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం తరహాలోనే తమకు కూడా వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉండేలా అవకాశం కల్పించాలని బ్యాంకు సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి.