న్యాయవాది లేడు.. విచారణ లేదు.. నేరుగా ఉరిశిక్ష..! ఇరాన్‌లో 26 ఏళ్ల నిరసనకారుడికి శిలువ..!
ట్రంప్ కన్నేస్తే అగ్గే..! అమెరికా ఎఫెక్ట్‌తో ఇరాన్ అగ్నిగుండంలా మారింది. ఇరాన్..నివురు గప్పిన ముప్పులా రగులుతోంది. ఖమేనీ సర్కార్ వ్యతిరేకంగా ఆందోళనలు అట్టుడికాయి. అల్లర్లలో 5వందల మందికి పైగా చనిపోయారు. తాజాగా ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మధ్య, ఆందోళనకరమైన వార్త ఒకటి వెలగులోకి వచ్చింది.

ట్రంప్ కన్నేస్తే అగ్గే..! అమెరికా ఎఫెక్ట్‌తో ఇరాన్ అగ్నిగుండంలా మారింది. ఇరాన్..నివురు గప్పిన ముప్పులా రగులుతోంది. ఖమేనీ సర్కార్ వ్యతిరేకంగా ఆందోళనలు అట్టుడికాయి. అల్లర్లలో 5వందల మందికి పైగా చనిపోయారు. తాజాగా ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మధ్య, ఆందోళనకరమైన వార్త ఒకటి వెలగులోకి వచ్చింది. ఈ నిరసనలకు సంబంధించిన కేసు మొదటి మరణశిక్షకు దారితీయవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, 26 ఏళ్ల ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీయనున్నారు. బుధవారం నాటికి శిక్ష అమలు చేసే అవకాశముందని సమాచారం.
టెహ్రాన్ సమీపంలోని కరాజ్‌లోని ఫర్డిస్ పరిసరాల్లో నివసించే ఎర్ఫాన్ సోల్తానిని జనవరి 8న ఖమేనీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నందుకు అరెస్టు చేశారు. మానవ హక్కుల సంస్థలు, మీడియా అతనికి మరణశిక్ష విధించిందని, ఎప్పుడైనా అమలు చేయవచ్చని చెబుతున్నాయి. దీంతో ఇరాన్‌లో నిరసనలను అణిచివేసేందుకు గతంలో మరణశిక్షను ఉపయోగించారు. కానీ చాలా సందర్భాలలో, కాల్పులు జరపడం ద్వారా ప్రజలకు మరణశిక్ష విధించారు. ప్రస్తుత నిరసనల సమయంలో ఇది మొదటి ఉరిశిక్షగా పేర్కొంటున్నారు.
ఇజ్రాయెల్ – అమెరికాకు చెందిన వార్తా సంస్థ జెఫీడ్ కథనం ప్రకారం, సోల్టాని కేసు పెరుగుతున్న కఠినమైన శిక్షల శ్రేణికి నాంది కావచ్చు. ఇరాన్ ప్రభుత్వం ఇటువంటి కఠినమైన చర్యలతో తదుపరి నిరసనలను నిరోధించడానికి ప్రయత్నిస్తోందని పేర్కొంది. నార్వేజియన్-రిజిస్టర్డ్ కుర్దిష్ మానవ హక్కుల సంస్థ హెంగావ్ (హెంగావ్ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్) ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియ గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. మొత్తం ప్రక్రియలో పారదర్శకత లోపించిందని పేర్కొంది. ఇక అరెస్టు అయినప్పటి నుండి, ఇర్ఫాన్ సోల్తానీకి న్యాయవాదిని కలవడానికి లేదా తనను తాను సమర్థించుకోవడానికి అవకాశం నిరాకరించారు. అతని కుటుంబం కూడా కేసు గురించి కీలకమైన సమాచారాన్ని అందించకుండా దూరంగా ఉంచారు. అతన్ని అరెస్టు చేసిన ఏజెన్సీ కూడా స్పష్టంగా చెప్పలేదు.
ఇక జనవరి 11న సోల్తాని కుటుంబ సభ్యులకు మరణశిక్ష విధించినట్లు జాఫీద్ వెల్లడించినట్లు హెంగో సంస్థ తెలిపింది. ఆ తర్వాత, అతనిని 10 నిమిషాలు మాత్రమే కలవడానికి అనుమతించారు. ఈ శిక్ష తుది తీర్పు అని, షెడ్యూల్ ప్రకారం అమలు చేయడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారని కుటుంబానికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. సోల్టాని సోదరి, స్వయంగా లైసెన్స్ పొందిన న్యాయవాది. చట్టపరమైన మార్గాల ద్వారా కేసును కొనసాగించడానికి ప్రయత్నించిందని, కానీ కేసు ఫైల్‌ను చూడటానికి, తన సోదరుడికి ప్రాతినిధ్యం వహించడానికి, శిక్షను సవాలు చేయడానికి ఆమెకు అనుమతి లేదని వర్గాలు తెలిపాయి.
లెబనీస్-ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త మారియో నోఫాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నిరసనలలో ఇప్పటివరకు దాదాపు 2,000 మంది మరణించారని అన్నారు. ప్రభుత్వం భయాన్ని ఉపయోగించి జనసమూహాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
ఇరాన్‌లో ఈ కొత్త నిరసనలు డిసెంబర్ 2025 చివరలో ప్రారంభమయ్యాయి. దీనికి కారణం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అని చెబుతారు. ఇరానియన్ కరెన్సీ, రియాల్ విలువలో పదునైన తగ్గుదల, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో టెహ్రాన్ మార్కెట్లలో నిరసనలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత ఇతర నగరాలకు వ్యాపించాయి. దుకాణదారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమం ఇప్పుడు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో ఒకటిగా మారింది. సంస్కరణలు, మతాధికారుల పాలనకు ముగింపు పలకాలని డిమాండ్ చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
