AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Buses: సంక్రాంతి వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ చార్జీలపై మంత్రి కీలక ప్రకటన!

APSRTC Sankranti Good News: ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ ప్రయాణికులు భారీ ఊరట లభించింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపు ఉండదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. సంక్రాంతి నేపథ్యంలో బస్సుల్లో అదనపు ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు.

Sankranti Buses: సంక్రాంతి వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ చార్జీలపై మంత్రి కీలక ప్రకటన!
No Government Bus Fare Increase In Apsrtc
Anand T
|

Updated on: Jan 13, 2026 | 12:22 PM

Share

సంక్రాంతి పండగ వేళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల టికెట్‌ ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టం చేశారు. ఎప్పటిలా ధరల పెంపును కొనసాగించకుండా.. ఈసారి మినహాయింప ఇస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులపై ఆర్థిక భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఎలాంటి అదనపు ఛార్జీలు పెంచబోమన్నారు. అలాగే శ్రీశక్తి పథకం కింద కొనసాగుతున్న మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. అలాగే సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించేవారు ప్రజలు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సుల్లో ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తూ.. రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.

అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు. పండగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధనపు ఛార్జీలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేసినట్టు నిర్దారణ అయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.