గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్..! ఏది తీసుకుంటే మంచిది? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే?
RBI రెపో రేటు తగ్గింపు తర్వాత, గోల్డ్ లోన్లు, పర్సనల్ లోన్‌లలో ఏవి తక్కువ వడ్డీకి లభిస్తాయో తెలుసుకోండి. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో మరిన్ని రేటు కోతలు ఆశించబడ్డాయి. బంగారు రుణాలు వేగంగా, తక్కువ వడ్డీతో ఉంటాయి, అయితే వ్యక్తిగత రుణాలు చౌకగా మారే అవకాశం ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 ఏడు సార్లు రెపో రేట్లను సవరించింది. ద్రవ్యోల్బణం చాలా వరకు అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధి నెమ్మదిగా స్టేబుల్ అవుతున్న క్రమంలో రాబోయే నెలల్లో మరిన్ని సార్లు రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. ఈ క్రమంలో చాలా మంది ఎక్కువ తీసుకునే రుణాల్లో ముందు వరుసలో ఉండే గోల్డ్ లోన్లు, పర్సనల్ లోన్లపై ఎలాంటి ప్రభావం పడింది? వీటి వడ్డీ రేట్లు తగ్గాయా? లేదా? ప్రస్తుత వడ్డీ రేట్లతో ఏ లోన్ తీసుకోవడం ఉత్తమం అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈ లోన్ల అంశంపై ఎప్సిలాన్ మనీ సహ వ్యవస్థాపకుడు, CEO అభిషేక్ దేవ్ మాట్లాడుతూ.. రేటు తగ్గింపు చక్రంలో వ్యక్తిగత రుణాలు చౌకగా మారే అవకాశం ఉంది. పైగా పర్సనల్ లోన్‌కు ఎలాంటి షురిటీ అవసరం లేదు. కానీ, గోల్డ్ లోన్‌కు మాత్రం గోల్డ్‌ను పూచీకత్తుగా పెట్టాల్సి ఉంటుంది. దీంతో పర్సనల్ లోన్లతో పోల్చుకుంటే గోల్డ్ లోన్లు తక్కువ వడ్డీకి లభిస్తాయి. అయితే గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మీరు బంగారం తాకట్టు పెట్టాలి. కానీ, పర్సనల్ లోన్‌కు ఎలాంటి షురిటీలు అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్, సాలరీ ఆధారంగా పర్సనల్ లోన్లు లభిస్తాయి. ప్రాసెస్ విషయంలో రెండు కూడా వేగంగానే అవుతాయి. అయితే ఆర్బీఐ వచ్చే వారం కూడా రెపో రేటు తగ్గించే సూచనలు ఉండటంతో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
మరి ఈ రెండు లోన్లలో ఏ లోన్ తీసుకోవాలనే విషయానికి వస్తే.. మీ వద్ద బంగారం ఉండి, ఒక నిర్ధిష్ట కాలంలో డబ్బు పూర్తిగా తిరిగి కట్టగలిగే అవకాశం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిది. తాకట్టు పెట్టేందుకు బంగారం లేకుంటే పర్సనల్ లోన్ బెటర్ ఆప్షన్ అవుతుంది. పైగా నెలకు ఇంత ఈఎంఐ కట్టేస్తే లోన్ కూడా తీరిపోతుంది. ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఎలాంటి షురిటీ అవసరం లేదు కాబట్టి మీరు పలు బ్యాంకుల నుంచి ఆన్‌లైన్‌లో లోన్ కోసం అప్లయ్ చేసుకొని తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
