ఒకప్పుడు చికెన్ కూర వండాలంటే.. ఇంట్లో పెంచుకున్న నాటు కోళ్లను కోసి కూర వండేవారు. ఎప్పుడో ఒకసారి చుట్టాలు వచ్చినప్పుడు, పండుగల సమయంలో నాటు కోడి కూర వండి తినేవారు
TV9 Telugu
కానీ ఇప్పుడైతే వారంలో నాలుగైదు సార్లు ఎప్పుడంటే అప్పుడు బ్రాయిలర్ చికెన్ తినేస్తున్నారు. బ్రాయిలర్ చికెన్ ను చాలా మంది స్కిన్ లేకుండా కూడా తింటున్నారు
TV9 Telugu
అయితే చికెన్ ను స్కిన్‌తో తినకూడదని, మంచిది కాదని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. నిజంగానే చికెన్‌ను స్కిన్‌తో తినకూడదా.. చికెన్‌ను స్కిన్‌తో సహా తింటే ఏమవుతుంది? వంటి సందేహాలు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి
TV9 Telugu
నిజానికి.. చికెన్‌ను స్కిన్‌తో తినకూడదనేది ఒట్టి అపోహ మాత్రమే. చికెన్ స్కిన్‌లోనూ మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
చికెన్ స్కిన్‌లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఓలియిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు జాబితాకు చెందుతుంది
TV9 Telugu
అలాగే కొద్ది మొత్తంలో పాలిఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. ఈ రెండు రకాల కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన శరీరంలో చేరే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి
TV9 Telugu
చికెన్ లో ఉండే శాచురేటెడ్ కొవ్వులు కూడా ఆరోగ్యకరమైన కొవ్వులే ఎక్కువ. కనుక చికెన్‌ను స్కిన్‌తో సహా తినడమే మంచిది. ఇక చికెన్ బ్రెస్ట్ పీస్‌ను స్కిన్‌తో సహా తింటే స్కిన్‌లెస్ కన్నా కాస్త క్యాలరీలు అధికంగా చేరుతాయి
TV9 Telugu
చికెన్ స్కిన్‌లో కొల్లాజెన్ ఉంటుంది. ఇది మన చర్మం, శిరోజాలు, గోర్ల సంరక్షణ, పెరుగుదలకు సహాయం చేస్తుంది. ఇందులోని మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యంగా ఉంటుంది