AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్.. ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లోకి

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్.. ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లోకి
Ntr
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2026 | 1:34 PM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటన గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తారక్ కు జపాన్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా కూడా జపాన్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఇటీవల వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు తారక్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్.

అయితే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన మొదటి సినిమా ఎదో తెలుసా.? తొలిసారి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు ఏకంగా పది లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారు. ఆ సినిమా మరేదో కాదు ఆంధ్రావాలా

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 2004లో విడుదలైన ఆంధ్రావాలా. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కు భారీగా ఫ్యాన్స్ హాజరయ్యారు. ఏకంగా నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 10లక్షలకు పైగా హాజరయ్యారు ఆ ఈవెంట్ కు. కాగా ఇప్పుడు ఆంధ్రావాలా  సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటింది. ఈ సందర్భంగా ఈ నెల 26న రీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు. దాంతో ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..