AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy Jobs 2026: నెలకు రూ.లక్షన్నర జీతంతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2027 కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ నేవీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కోర్సులో ప్రవేశాలు 2027 జనవరి నుంచి ప్రారంభం..

Indian Navy Jobs 2026: నెలకు రూ.లక్షన్నర జీతంతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
Indian Navy SSC Officer Recruitment
Srilakshmi C
|

Updated on: Jan 13, 2026 | 9:53 AM

Share

ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ).. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2027 కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ నేవీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కోర్సులో ప్రవేశాలు 2027 జనవరి నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

బ్రాంచ్‌ల వివరాలు ఇలా..

  • ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ (జీఎస్‌(ఎక్స్‌)/ హైడ్రో కేడర్‌) పోస్టుల సంఖ్య: 76
  • పైలట్ పోస్టుల సంఖ్య: 25
  • నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (అబ్జర్వర్స్‌) పోస్టుల సంఖ్య: 20
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుల సంఖ్య: 18
  • లాజిస్టిక్స్ పోస్టుల సంఖ్య: 10
  • ఎడ్యుకేషన్‌ పోస్టుల సంఖ్య: 7
  • ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) పోస్టుల సంఖ్య: 42
  • సబ్‌మెరైన్‌ టెక్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 8
  • ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) పోస్టుల సంఖ్య: 38
  • సబ్‌మెరైన్‌ టెక్‌ ఎలక్ట్రికల్‌ పోస్టుల సంఖ్య: 8

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు, వయోపరిమితి కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 24, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతల మార్కులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్‌ నావల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ) శిక్షణ ఇస్తారు. అనంతరం విధులు కేటాయిస్తారు. ఈ పోస్టుల ప్రారంభ వేతనం నెలకు రూ.1,25,000 నుంచి ప్రారంభమవుతుంది.

ఇండియన్ నేవీ ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.