రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఓ ఇంగ్లిష్ సామెత ఉంది. ఆరోగ్యానికి యాపిల్ చేసే మేలు అలాంటిది మరి. ఇది గుండె ఆరోగ్యానికీ ఎంతగానో తోడ్పడుతుంది
TV9 Telugu
యాపిల్, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో పెక్టిన్ అనే పీచు పదార్థం ఉంటుంది. నీటిలో కరిగే గుణం గల ఇది చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పూ తగ్గుతుంది
TV9 Telugu
యాపిల్‌లో కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియంలతో యాపిల్ మంచి పోషకాహారం. మలబద్ధక సమస్యను నివారిస్తుంది
TV9 Telugu
ఇది రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. అగ్న్యాశయానికి (పాంక్రియాజ్) మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
మంచి పోషకాలతో దండిగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్ మంచిది
TV9 Telugu
అమెరికాలో 40 వేలమంది మీద జరిపిన పరిశోధనలో యాపిల్స్ తినేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని తేలింది. టైప్ 2 డయాబెటిస్, రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుంది
TV9 Telugu
సైనస్, ఉబ్బసం తదితర శ్వాస ఇబ్బందులను నివారిస్తుంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది త్వరగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులకు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా మంచిది
TV9 Telugu
మనలో చాలామంది యాపిల్ చెక్కు తీసి తింటుంటారు. నిజానికి అందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తొక్క తీయకుండానే తినాలని వైద్యులు చెబుతున్నారు