AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్ రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైందా..? ఇలా చేస్తే మీకు రీఫండ్‌తో పాటు ఫ్రీగా ఫుడ్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్లు ఆలస్యమైతే మీరు ఐఆర్‌సీటీసీ నుంచి పూర్తి రీఫండ్‌తో పాటు ఫ్రీ ఫుడ్ పొందవచ్చు. ఈ సౌకర్యాలు పొందేందుకు కొన్ని నిబంధనలు ఐఆర్‌సీటీసీ అమలు చేస్తోంది. వీటిని మీరు అర్హత సాధిస్తే రైల్వేశాఖ నుంచి లబ్ది పొందోచ్చు.

Indian Railways: ట్రైన్ రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైందా..? ఇలా చేస్తే మీకు రీఫండ్‌తో పాటు ఫ్రీగా ఫుడ్..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Jan 13, 2026 | 11:06 AM

Share

ఇండియాలో రైల్వే నెట్‌వర్క్ దేశ నలుమూలకు విస్తరించి ఉంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద రైల్వే కనెక్టివిటీని భారత్ కలిగి ఉంది. తరచూ లక్షలాది మంది ప్రజలు రైళ్లల్లో ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అమృత్ భారత్, వందే భారత్ లాంటి అత్యాధునిక హైస్పీడ్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ప్రయాణికులకు వెగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం లభిస్తోంది. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా లాంచ్ చేసేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఈ నెల 17వ తేదీన వందే భారత్ స్లీపర్ రైలును హౌరా-గువహతి మధ్య ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గంటకు 180 కిలోమీర్ల వేగంతో ఈ ట్రైన్ ప్రయాణించనుంది. ఈ రైల్లో రాత్రిపూట ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా లగ్జరీగా ప్రయాణించవచ్చు.

ఫ్రీ ఫుడ్ సౌకర్యం

అయితే ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే అనేక నిబంధనలు పాటిస్తోంది. ఈ నిబంధనలు చాలామందికి తెలియక ఉపయోగించుకోవడం లేదు. మీరు ప్రయాణించాల్సిన ట్రైన్ ఆలస్యంగా వస్తే మీరు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి అనేక సౌకర్యాలు పొందవచ్చు. టికెట్ పూర్తి రీఫండ్‌ ఇవ్వడమే కాకుడా టిఫిన్, లంచ్, డిన్నర్ వంటివి ఉచితంగా పొందవచ్చు. మీరు ప్రయాణించాల్సిన రైలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే మీరు రైల్వేశాఖ నుంచి ఉచిత మీల్స్, వసతి సౌకర్యం పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో టికెట్ డబ్బులు పూర్తిగా రీఫండ్ చేస్తారు. ట్రైన్ ఆలస్యమయ్యే సమయాన్ని బట్టి రీఫండ్ ఉంటుంది. ఈ మేరకు ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేలా ఐఆర్‌సీటీసీ ఈ రూల్స్‌ను అమలు చేస్తోంది. అయితే చాలామంది ప్రయాణికులకు వీటి గురించి అవగాహన లేక ఉపయోగించుకోలేకపోతున్నారు.

టికెట్ పూర్తి రీఫండ్ ఎప్పుడంటే..?

రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచితంగా ఫుడ్ కల్పించాల్సి ఉంటుంది. ఉదయం పూట ఆలస్యమైతే టీ, కాఫీ, బిస్కెట్లు, మిల్స్ క్రీమ్ వంటివి అందిస్తారు. ఇక బ్రేక్‌ఫాస్ట్ క్రింద నాలుగు బ్రెడ్ ముక్కలు, జ్యూస్ వంటివి వడ్డిస్తారు. లంచ్, డిన్నర్ విషయానికొస్తే.. ఎల్లో రైస్, రాజ్మా, చోలే, పికెట్ సాచెట్ వంటివి అందించడం జరుగుతుంది. ఇక రైళ్లు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులు పూర్తి రీఫండ్ పొందవచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లోకి వెళ్లి టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.  టీడీఆర్ ఫైల్ చేశాక 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.