DMart: వామ్మో.. డీమార్ట్ బిల్లుపై స్టాంప్ వేయడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఈ విషయం ఎవ్వరికీ తెలిసి ఉండదు
డీమార్ట్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. దేశవ్యాప్తంగా సిటీల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఇవి అందుబాటులోకి వచ్చేశాయి. ఎక్కువమంది ఇంట్లోకి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు డీమార్ట్‌కు వెళ్తుంటారు. అయతే డీమార్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు బిల్లుపై స్టాంప్ ఎందుకు వేస్తారో మీకు తెలుసా..?

మనలో ప్రతీఒక్కరూ ఒక్కసారైనా డిమార్ట్‌కు వెళ్లి ఉంటారు. కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో డీమార్ట్‌ను సందర్శించి ఉంటారు. ఇంట్లోకి అవసరమయ్యే అన్నీ సరుకులు, వస్తువులతో పాటు బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఇలా ప్రతీది డీమార్ట్‌లో లభిస్తాయి. అన్నీ వస్తువులు ఒకేచోట దొరుకుతుండటంతో వేరే వేరే షాపులు తిరగాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల సమయం కూడా ఆదాయం అవుతుంది. ఈ కారణంతో డీమార్ట్‌కు ఎక్కువమంది వెళుతూ ఉంటారు. అంతేకాకుండా డీమార్ట్‌లో హోల్ సేల్ ధరలకే అన్నీ వస్తువులు లభించడంతో పాటు అనేక డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. దీంతో డీమార్ట్‌ను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ఇంట్లోకి ఏదైనా అవసరమైతే వెంటనే డీమార్ట్‌నే టక్కున అందరికీ గుర్తొస్తూ ఉంటుంది.
బిల్లుపై స్టాంప్ ఎందుకంటే..?
అయితే డీమార్ట్‌లో అనేక విషయాలు మనల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. భారీ డిస్కౌంట్ ఆఫర్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం లాంటి ఆఫర్లనే కాకుడా అక్కడ జరిగే కొన్ని సంఘటనలు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. డీమార్ట్‌కు వెళ్లి మనం కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లు పే చేసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో ఎగ్జిట్ డోర్ వద్ద సెక్యూరిటీ గార్డ్ బిల్లుపై స్టాంప్ వేయడం మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎందుకు వేస్తారనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఇలా బిల్లుపై స్టాంప్ వేయడానికి రీజన్ ఏంటనేది చాలామందికి తెలియదు. కానీ దీని వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. భద్రత దృష్ట్యా అలా బిల్లుపై స్టాంప్ వేసే రూల్ ప్రవేశపెట్టారు. డీమార్ట్‌లోని వస్తువులు చోరీకి గురి కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
బ్యాగులను ఎందుకు చెక్ చేస్తారంటే..?
బిల్లుపై స్టాంప్ వేయడానికంటే ముందు మీ బ్యాగుల్లోని వస్తువులను సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తాడు. బ్యాగులోని వస్తువులు బిల్లుతో సరిపోయాయా..? లేదా? అనేది తనిఖీ చేస్తాడు. డీమార్ట్‌లో క్వారీ బ్యాగ్ కోసం అదనంగా రుసుం వసూలు చేస్తారు. మీరు ఎన్ని క్యారీ బ్యాగ్‌లు తీసుకుంటే అన్ని బ్యాగుల సంఖ్యను బిల్లులో ఎంట్రీ చేస్తారు. మీరు డిమార్ట్ బిల్లును పరిశీలిస్తే సీ1, సీ2, సీ3 లాంటివి ఉంటాయి. సీ అంటే క్యారీ బాగ్ అని అర్థం. మీరు ఎన్ని బ్యాగులు తీసుకుంటే ఆ సంఖ్య పక్కన రాసి ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ ముందుగా మీ బిల్లు తీసుకుని అందులో క్యారీ బ్యాగుల సంఖ్య చూస్తాడు. ఆ తర్వాత మీ ట్రాలీలో ఎన్ని బ్యాగ్‌లు ఉన్నాయో చెక్ చేశాడు. బిల్లుపై ఉన్న సంఖ్యకు సమానంగా మీ దగ్గర బ్యాగ్‌లు ఉన్నాయా..? లేదా అదనంగా ఉన్నాయా? అనేది తనిఖీ చేస్తాడు. ఆ తర్వాత బిల్లుపై స్టాంప్ వేసి పంపిస్తారు.
