AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీలో ఆల్ టైమ్ రికార్డ్.. ముంబైపై పడిక్కల్ వీరోచిత పోరాటం

Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ మరో అద్భుత రికార్డు సాధించాడు. ముంబైపై 81 నాటౌట్‌తో కర్ణాటక విజయంలో కీలకంగా నిలిచి, రెండు సీజన్లలో 700+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు , 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీలో ఆల్ టైమ్ రికార్డ్.. ముంబైపై పడిక్కల్ వీరోచిత పోరాటం
Devdutt Padikkal
Rakesh
|

Updated on: Jan 13, 2026 | 8:05 AM

Share

Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ పోరులో దేవదత్ పడిక్కల్ మరోసారి తన సత్తా చాటాడు. ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఒత్తిడిని అధిగమించి 81 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 11 ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించిన పడిక్కల్, కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే పడిక్కల్ ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో రెండు వేర్వేరు సీజన్లలో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా పడిక్కల్ రికార్డు సృష్టించాడు. గతంలో పృథ్వీ షా, మయంక్ అగర్వాల్ వంటి దిగ్గజాలు ఒక సీజన్‌లో ఈ మార్కును దాటినా, రెండు సార్లు ఈ ఫీట్ సాధించడం మాత్రం ఒక్క పడిక్కల్‌కే సాధ్యమైంది.

ప్రస్తుత సీజన్‌లో పడిక్కల్ ఫామ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆడిన 8 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 721 పరుగులు బాదాడు. ఇందులో 4 సెంచరీలు , 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తూ, కీలక సమయాల్లో బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. ఇన్ని సెంచరీలు, ఇన్ని పరుగులు చూస్తుంటే పడిక్కల్ టీమిండియా తలుపులు మరోసారి గట్టిగా తడుతున్నాడని స్పష్టమవుతోంది. క్లాసిక్ షాట్లతో పాటు వేగంగా పరుగులు రాబట్టడంలో పడిక్కల్ తనదైన ముద్ర వేస్తున్నాడు.

ముంబైతో జరిగిన ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. షమ్స్ ములానీ 86 పరుగులతో రాణించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటకకు పడిక్కల్, కరుణ్ నాయర్ గట్టి పునాది వేశారు. కర్ణాటక 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 187 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆట సాధ్యం కాకపోవడంతో వీజేడీ పద్ధతి ప్రకారం కర్ణాటకను 55 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు. పడిక్కల్‌కు తోడుగా కరుణ్ నాయర్ కూడా 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో తోడ్పడ్డాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు..
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!
విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..
విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌