AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాన్స్ అబ్బాయి.. తెలుగు అమ్మాయి.. ఒక్కటి చేసిన హిందూ సాంప్రదాయం..!

ప్రేమ కేవలం రెండు అక్షరాలు కాదు. రెండు మనస్సుల కలయిక. స్వచ్ఛమైన ప్రేమైతే.. ఎల్లలు ఏంటి ఖండాంతరాలు దాటుతుందని నిరూపించాయి. కులాలు వేరు.. ప్రాంతాలు వేరు.. దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. ఇద్దరి మనస్సులు కలిసి, అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి లే కాకుండా రెండు కుటుంబాల పెద్దలను సైతం ఖండాంతరాలు దాటేలా చేసింది.

ప్రాన్స్ అబ్బాయి.. తెలుగు అమ్మాయి.. ఒక్కటి చేసిన హిందూ సాంప్రదాయం..!
French Boy And Telugu Girl Marriage
N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 13, 2026 | 11:12 AM

Share

ప్రేమ కేవలం రెండు అక్షరాలు కాదు. రెండు మనస్సుల కలయిక. స్వచ్ఛమైన ప్రేమైతే.. ఎల్లలు ఏంటి ఖండాంతరాలు దాటుతుందని నిరూపించాయి. కులాలు వేరు.. ప్రాంతాలు వేరు.. దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. ఇద్దరి మనస్సులు కలిసి, అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి లే కాకుండా రెండు కుటుంబాల పెద్దలను సైతం ఖండాంతరాలు దాటేలా చేసింది. పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటై తమ స్వచ్చమైన ప్రేమను చాటుకున్నారు.

ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ లోని జీఎమ్ఆర్ కళ్యాణ మండపంలో ప్రాన్స్ దేశానికి చెందిన అబ్బాయికి భారత దేశానికి చెందిన అమ్మాయితో భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ఓక్కటయ్యారు. తెలుగుతనం ఉట్టి పడేలా ఘనంగా వివాహం జరిగింది. ప్రాన్స్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులతో తెలుగు పెళ్లి మండపం నిండిపోయింది. తెలంగాణ జానపద DJ పాటలకు మన వాళ్ళతో కలిసి ఇంగ్లీష్ వాళ్ళు స్టెప్పులేశారు. పెళ్లి ఆద్యంతం ఆసక్తినీ కలిగించింది.

ఇక ఈ తంతు కు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన జినక వెంకన్న, ఎల్లమ్మల కూతురు ప్రశాంతి ఉన్నత చదువుల కోసం ప్రాన్స్ దేశానికి వెళ్ళింది. చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రాన్స్ దేశానికి కాపిటల్ సిటీ అయిన పారిస్ పట్టణానికి దగ్గరలోని నాథన్ అనే ప్రాంతానికి చెందిన నాథన్ క్రిస్టోఫ్ జూబర్ అనే ప్రాన్స్ అబ్బాయి తో స్నేహం కుదిరింది. కాలక్రమేణ స్నేహం కాస్త ప్రేమగా మారింది. రెండు దేశాల సంప్రదాయాలు, అభిరుచులు వేరైనప్పటికీ వారిద్దరినీ ప్రేమ పెళ్లితో ఒక్కటి చేసింది. ఇక్కడమ్మాయి, అక్కడబ్బాయి లు పెద్దలను ఒప్పించి ఖండాంతరాలు దాటించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటంబాలతో పాటు పెళ్లికి వచ్చిన వారందరినీ సంతోష పరిచింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..