AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO WhatsApp: వాట్సప్ ద్వారా పీఎఫ్ సేవలు.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ మీ మొబైల్‌లోనే.. ఎలానో తెలుసుకోండి

ప్రస్తుతం ఏ సేవ కావాలన్నా వాట్సప్ ద్వారా సులువుగా పొందే సౌకర్యం అందుబాాటులోకి వచ్చింది. ప్రభుత్వ సేవలన్నీ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా పొందవచ్చు. అందులో భాగంగానే పీఎఫ్ సేవలు కూడా వాట్సప్ ద్వారా పొందవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తెచ్చింది.

EPFO WhatsApp: వాట్సప్ ద్వారా పీఎఫ్ సేవలు.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ మీ మొబైల్‌లోనే.. ఎలానో తెలుసుకోండి
Epfo Whatsapp
Venkatrao Lella
|

Updated on: Jan 13, 2026 | 12:02 PM

Share

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ఖాతాలను కలిగి ఉన్నారు. పీఎఫ్‌ సేవలను సులువుగా ఉపయోగించుకునేలా ఈపీఎఫ్‌వో ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో పీఎఫ్‌కు సంబంధించిన అనుమానాలు, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈపీఎఫ్‌వో వాట్సప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా ఖాతాదారులు తమ ఫిర్యాదులు తెలపవచ్చు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి ప్రయత్నం చేశారు. ప్రతీ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఓ వాట్సప్ హెల్ఫ్‌లైన్ నెంబర్ ప్రవేశపెట్టింది. స్థానిక ఈపీఎఫ్‌వో కార్యాలయాన్ని వాట్సప్ ద్వారా కాంట్రాక్ట్ అవ్వడం ద్వారా సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల ఈ వాట్సప్ సేవలను ఈపీఎఫ్‌వో ప్రారంభించింది.

138 ప్రాంతీయ కార్యాయాల్లో సేవలు

ఈపీఎఫ్‌వోకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 138 ప్రాంతీయ కార్యాలయాల్లో వాట్సప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మీ పీఎఫ్ అకౌంట్ ఏ ప్రాంతీయ కార్యాలయంలో ఉండే ఈ ఆఫీస్ వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు మీ ఫిర్యాదులు పంపవచ్చు. ఈపీఎఫ్ అకౌంట్లోని సమస్యలు అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్లోకి ప్రాంతీయ కార్యాలయాల వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్లను తెలుసుకోవచ్చు. మీ పీఎఫ్ బ్యాలెన్స్, స్టేట్ మెంట్, కేవైసీ వివరాలు వంటి వాటిల్లో తప్పులు, ఇతర సమస్యలు అన్నింటిపై ఫిర్యాదు చేయవచ్చు. 

ప్రాంతీయ కార్యాలయాన్ని ఎలా తెలుసుకోవాలి..?

www.epfindia.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి

-సర్వీసెస్ ట్యాబ్ మీద క్లిక్ చేసి యజమానుల ఆప్షన్‌ను ఎంచుకోండి

-సర్వీస్ ట్యాబ్‌పై క్లిక్ చేసి ఎస్టాబ్లిష్‌మెంట్ సెలక్ట్ చేసుకోండి

-సంస్థ పేరు, సంస్థ కోడ్ వివరాలు, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి

-మీ సంస్థ పేరు, కోడ్, ఈపీఎఫ్‌వో కార్యాలయం పేరు, ఈపీఎఫ్‌వో అడ్రస్, వాట్సప్ హెల్ప్ లైన్ నెంబర్లు వంటివి కనిపిస్తాయి.

ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల వాట్సప్ నెంబర్లు

-గుంటూరు08632344123

-కడప-9491138297

-రాజమండ్రి-9494633563

-విశాఖపట్నం-7382396602

-హైదరాబాద్ బర్కత్‌పుర-9100026170

-హైదరాబాద్ మాదాపూర్-9100026146

-కరీంనగర్-9492429685

-కూకట్ పల్లి-9392369549

పటాన్‌చెర్వు-9494182174

-వరంగల్-8702447772