నిమ్మకాయ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఆరోగ్యకరమైన పండు. అయితే, గ్యాస్ట్రిక్ అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్, థైరమిన్ గుండెల్లో మంట, మైగ్రేన్‌ను పెంచుతాయి. అధికంగా తాగితే అసిడిటీ వస్తుంది. రోజుకు ఒకటి, రెండు గ్లాసులకు మించి తీసుకోకూడదు.