Rajamouli: అంజి ఫ్లాప్ తర్వాత ఆయన బాగా డౌన్ అయ్యారు.. కానీ ఆ తర్వాత దమ్ము చూపించారు..
అంజి సినిమా ఫ్లాప్ తర్వాత నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని, అప్పుల్లో ఉండి కూడా 'అరుంధతి' సినిమా కోసం కష్టపడ్డారని ఎస్‌ఎస్ రాజమౌళి వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీలో తెలుసుకుందామా.. లుక్కేయండి మరి.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన వ్యక్తిగత విషయాలు, సినీ కెరీర్, రోల్ మోడల్స్ గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని తాను ఇష్టపడతానని, వారంతా తనకు ప్రేరణే అని రాజమౌళి అన్నారు. ముఖ్యంగా జయప్రకాశ్ నారాయణ్‌ను తన రోల్ మోడల్‌గా పేర్కొన్నారు. తాను దేవుణ్ణి నమ్మకపోయినా, జయప్రకాశ్ నారాయణ్‌ను ఆ స్థానంలో పెట్టుకుంటానని తెలిపారు. రామోజీరావును ఉదాహరణగా చూపిస్తూ, పేపర్ బాయ్ స్థాయి నుంచి ఒక పేపర్ టైకూన్‌గా ఎదగడం తనకు తక్షణమే స్ఫూర్తినిస్తుందని చెప్పారు. పెద్ద స్థాయికి చేరినవారే కాకుండా, చిన్న చిన్న విషయాలు కూడా తనను ప్రేరేపిస్తాయని రాజమౌళి వివరించారు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
జూబ్లీహిల్స్ నుంచి నార్నే రోడ్డు మీదుగా మణికొండలోని పంచవటి కాలనీకి వెళ్తుండగా.. ఒక చిన్న సైట్ వద్ద ఒక్క ఆఫీసు మాత్రమే ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక చిన్న కొట్టును ఏర్పాటు చేసి ఫ్లాస్క్‌లో టీ, సిగరెట్లు, వక్కపొడి ప్యాకెట్లు అమ్మాడని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఫ్లాస్క్ అయిపోతే మళ్లీ ఎక్కడికో వెళ్లి తెచ్చి ఇచ్చేవాడని, ఇప్పుడు రెండేళ్లు, మూడేళ్ల తర్వాత చూస్తే అదే చిన్న కొట్టు పెద్ద సైజు బడ్డీ కొట్టుగా మారి, నిరంతరం రద్దీతో ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఆ వ్యక్తి కృషి, ఎదుగుదల కూడా తనకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. ఉద్యోగాలు లేని సమయంలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటే ఎవరైనా పైకి రాగలరని, అలాంటి వారిని చూస్తే తాను ప్రేరణ పొందుతానని రాజమౌళి చెప్పారు.
సినిమా రంగంలో తనకు శ్యాంప్రసాద్ రెడ్డి అంటే చాలా గౌరవం అని రాజమౌళి అన్నారు. తాను సహజంగా భయస్తుడినని, ఎక్కువ రిస్క్ తీసుకోనని, ఒకవేళ తీసుకున్నా చాలా జాగ్రత్తగా తీసుకుంటానని చెప్పారు. అయితే, శ్యాంప్రసాద్ రెడ్డి అలా కాదని, ధైర్యంగా ముందడుగు వేసి గెలిచారని రాజమౌళి ప్రశంసించారు. చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమా ఫ్లాప్ తర్వాత నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆర్థికంగా పూర్తిగా కృంగిపోయారని, అప్పుల ఊబిలో కూరుకుపోయారని రాజమౌళి గుర్తు చేశారు. ‘అరుంధతి’ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అప్పుల్లో ఉండి కూడా ఐదు కోట్ల అంచనాతో ప్రారంభించారని, దానిని బాగా తీర్చిదిద్దడానికి ఇంకా అప్పులు చేసి, విజయం సాధించారని రాజమౌళి వివరించారు. ‘అరుంధతి’ సినిమాపై ఆయన చూపినంత పిచ్చి, ప్యాషన్ ఉన్న వారిని తాను ఇప్పటి వరకు చూడలేదని రాజమౌళి స్పష్టం చేశారు. అలాంటి ధైర్యం తాను చేయలేనని, అందుకే శ్యాంప్రసాద్ రెడ్డి అంటే తనకు చాలా గౌరవం అని రాజమౌళి పేర్కొన్నారు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




