Tollywood : ఇప్పుడు మరింత భయంకరంగా ఉన్నావు.. నెటిజన్స్ ట్రోల్స్ పై హీరోయిన్ రియాక్షన్..
సాధారణంగా సినీతారల ఫిట్నెస్, లుక్స్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు నెటిజన్స్. ముఖ్యంగా హీరోయిన్స్ బాడీ, ఫేస్ లో కాస్త డిఫరెన్స్ వస్తే చాలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోలపై విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా తన గురించి వస్తున్న ట్రోలింగ్ పై ఘాటుగానే రియాక్ట్ అయ్యింది.

బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపై సందడి చేస్తుంది. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్లుగా ఈ హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కట్ చేస్తే.. ఇప్పుడిప్పుడే తిరిగి సినీరంగంలో యాక్టివ్ అవుతుంది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు గురించి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లుక్స్ విషయంలో ఆమె పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని.. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ ప్రచారం నడుస్తుంది. ఇక ఇటీవల ది భూత్నీ సినిమా ఈవెంట్లోనూ ఆమె పాల్గొన్న నాటి నుంచి విమర్శలు మరింత పెరిగాయి. ఆమె ముఖ కవలికలు మారిపోయాయనని.. ఇప్పుడు మరింత భయంకరంగా కనిపిస్తుందంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. తాజాగా తన గురించి వస్తున్న కామెంట్స్ పై సదరు హీరోయిన్ స్పందించింది. ఇంతకీ ఇన్నాళ్లు విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్న వయ్యారి ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి అడుగుపెట్టింది మౌనీ రాయ్. ఆ తర్వాత నాగిని సీరియల్ ద్వారా అన్ని భాషలలోనూ గుర్తింపు తెచ్చుకుంది. అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత రణబీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె ది భూత్నీ సినిమాలో నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ ఈవెంట్లో పాల్గొన్న మౌనీ రాయ్ లుక్స్ పై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. ఆమె లుక్స్ పూర్తిగా మారిపోయాయని.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని ప్రచారం నడిచింది. తాజాగా తన పై వస్తున్న ట్రోల్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యింది మౌనీ రాయ్. వాటిని తాను ఏమాత్రం పట్టించుకోనని అన్నారు.
‘నాపై కామెంట్స్ చేసేవాళ్లు నాకు కనిపించరు. కాబట్టి వాళ్ల మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఇతరులను ట్రోల్స్ చేస్తూ ఆనందాన్ని పొందాలనుకుంటే మాత్రం మనం ఏం చేస్తాం.. ఎవరికి నచ్చినట్లు వాళ్లను ఉండనివ్వండి’ అని అన్నారు. ప్రస్తుతం మౌనీ రాయ్ నటించిన ది భూత్నీ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :