Meena : బాబోయ్.. మీనా కూతురు ఇంత అందంగా మారిపోయింది.. అందంలో అచ్చం తల్లిలాగే.. ఫోటోస్ వైరల్..
ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో చక్రం తిప్పిన హీరోయిన్లలో మీనా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కథానాయికగా అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక ఇప్పటికీ సహాయ నటిగా రాణిస్తుంది.

టాలీవుడ్ హీరోయిన్ మీనా గురించి చెప్పక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కథానాయికగా అలరించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీ వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న కథానాయికగా చక్రం తిప్పిన ఈ హీరోయిన్… ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు జోడిగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మీనా చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదోక క్రేజీ ఫోటోషూట్ షేర్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఆమె కూతురు నైనికా ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇన్నాళ్లు ముద్దుగా క్యూట్ గా కనిపించిన నైనిక ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
తాజాగా మీనా కూతురు నైనిక ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. క్యూట్ గా ఉండే అమ్మాయి.. అప్పుడే అంత పెద్దగా ఎదిగిందా.. ఇంతందంగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నైనికా అచ్చం ప్రిన్సెస్ సిండ్రెల్లా లాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నైనిక వయసు 13 సంవత్సరాలు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. గతంలో విజయ్ దళపతి నటించిన తేరి చిత్రంలో కనిపించింది. ఇందులో విజయ్ కూతురిగా కనిపించింది. అలాగే పలు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం మీనా కూతురు చదువుపై దృష్టి పెట్టిందని.. ఆమె త్వరలోనే సినిమాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
బాలనటిగా నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మీనా, తరువాత హీరోయిన్‌గా మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఏలింది. వివాహం తర్వాత కొంతకాలం విరామం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం బిజీగా ఉంటుంది. మీనా ప్రస్తుతం మోహన్‌లాల్‌తో కలిసి దృశ్యం 3లో నటిస్తోంది. ఆమె 2009లో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్‌ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక జన్మించింది. కొన్నాళ్ల క్రితం విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..




